తెలంగాణ‌లో క‌రోనా ఏ నిమిషానికి ఎంత మందికి సోకుతుందో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. కేసీఆర్ క‌రోనా క‌ట్ట‌డికి ఇప్ప‌టికే ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే వైద్య సిబ్బందికి సెల‌వులు పూర్తిగా ర‌ద్దు చేశారు. అయితే రోజు రోజుకు తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా కొత్త కేసులు మాత్రం ఆగ‌డం లేదు. మార్చి 16 వ‌ర‌కు తెలంగాణ‌లో కేవ‌లం ఐదు క‌రోనా పాజిటివ్ కేసులు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో క‌రోనా పాజిటివ్ కేసులు చాలా ఎక్కువుగా న‌మోదు అయ్యాయి. 

 

ఒక మనిషి క్వారంటైన్ నుంచి త‌ప్పించు కుంటే ఆ వ్య‌క్తి ద్వారా ఎంతో మందికి క‌రోనా సోకుతోంది. అయితే ఇప్పుడు మ‌రో బాంబు లాంటి వార్త పేల‌నుందా ? అన్న సందేహాలు వ్య‌క్త మ‌వుతున్నాయి. ఈ రోజు వెల్ల‌డి అయ్యే క‌రోనా అనుమానితుల రిపోర్ట్స్‌పై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఈ రోజు  మొత్తం  97 మంది అనుమానితుల రిపోర్ట్స్ రానున్నాయి. వీరిలో ఎంత మందికి నెగిటివ్ రిపోర్టు వ‌స్తుంది ?  ఎంత మందికి పాజిటివ్ రిపోర్టు వ‌స్తుంది ? అన్నది స‌స్పెన్స్‌గా మారింది. ఇక క‌రోనా అనుమానం ఉన్న వారి నుంచి 104 కు కాల్స్ వెల్లువ‌లా వ‌స్తున్నాయి. 

 

ఇక ఇప్ప‌టికే తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు మొత్తం 33కు చేరుకున్నాయి. ఈ 97 మంది రిపోర్టులు సైతం ఎలా ఉంటాయి ? అన్న ఆందోళ‌న అటు ప్ర‌భుత్వ వ‌ర్గాల‌తో పాటు ఇటు పోలీసుల్లో ఉంది. వీరిలో ఎక్క‌వ మందికి పాజిటివ్ వ‌స్తే క‌రోనా వైర‌స్ తీవ్ర మ‌రింత ఎక్కువ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఏదేమైనా ప్ర‌భుత్వం వైర‌స్ వ్యాప్తికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా ప్ర‌జ‌ల నుంచి కూడా కోప‌రేష‌న్ ఉంటేనే దీనికి క‌ట్ట‌డి వేస్తాం.

మరింత సమాచారం తెలుసుకోండి: