అవును.. ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీలోని మీడియా దిగ్గజాలు ఈనాడు అధిపతి రామోజీరావు.. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇదేదో రాజకీయ భేటీ కాదు లెండి.. కరోనా దేశాన్ని కబళిస్తున్న వేళ.. ప్రధాని మోడీ కొన్ని రోజులుగా వివిధ రంగాల్లో పని చేస్తున్న ప్రముఖుల సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. వారికి కరోనా పై ఏమేం చేయాలో సూచిస్తున్నారు.

 

 

కరోనా కట్టడి కోసం వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఈరోజు పత్రికాధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీడియా పాత్ర చాలా కీలకమైనదని చెప్పిన మోదీ.. కరోనా కట్టడి కోసం కలసి రావాలని మీడియా సంస్థ అధిపతులకు సూచించారు. దేశంలోని పత్రికాధిపతులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా వారి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు.

 

 

ఈ సమావేశంలో దేశంలోని అనేక మీడియా సంస్థల అధిపతులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా మీడియా పని చేయాలని ప్రధాని మోడీ వారికి సూచించారు. ఇప్పటికే తమ పత్రికల తరపున ఎలాంటి సేవలు అందిస్తున్నారో వారు ప్రధానితో పంచుకున్నట్టు తెలుస్తోంది.

 

 

ఇక రాధాకృష్ణ సంగతి ఎలా ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోడీ ఈనాడు అధినేత రామోజీ రావుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న కొద్దిమంది తెలుగు వారిలో రామోజీ రావు ఒకరు. మోడీ హయాంలోనే రామోజీ రావు పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే కదా. ఏదేమైనా కరోనా కట్టడిలో మీడియా పాత్ర చాలా కీలకమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: