ప్రస్తుత ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ వ్యాప్తి చెంది వేలాది మంది ప్రాణాలు విడిచారు. అయితే.. ఈ పరిస్థితుల గురించి రసాయన శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత మైఖేల్‌ లెవిట్‌ వివరించారు. చైనాలో వేగంగా వైరస్ విస్తరించి మళ్లీ ఎలా తగ్గుముఖం పట్టిందో అలానే దేశంలో కూడా తగ్గుముఖం పడుతుందని ఆయన తెలిపారు.

 

కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలోనే లెవిట్ వైరస్ మందగిస్తుంది ఆయన అభిప్రయపడ్డారు. అలాగే కరోనా వైరస్ వలన జరిగే నష్టాలను ఆయన ముందుగానే అంచనా వేశారు. ఇటీవల చైనాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నపుడు ఆయన ఈ వైరస్ దాదాపు 80,000 మంది ఈ వైరస్ బారిన పడతారని, అలాగే ఈ వురస్ భారిన పడి 3,250 మంది చనిపోతానని ఆయన గత నెల అయిన ఫిబ్రవరిలో అంచనా వేశారు.

 

అలాగే ఆయన అంచనా వేసినట్టుగానే చైనాలో 80,298 మంది వైరస్ భారిన పడ్డారు. అలాగే మరణాల సంఖ్య కూడా ఆయన చెప్పినట్టుగానే 3425 కు చేరిన సంగతి తెలిసిందే. ఈ కరోనా వైరస్ ను ఎదిరించాలంటే ఒకరికి ఒకరు దూరంగా ఉండాలని, వైరస్ కు తగ్గట్టు జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. అలాగే జీవ భౌతిక శాస్త్రవేత్త అయిన లెవిట్ లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌తో మాట్లాడారు. ఈ కరోనా వైరస్ దశలవారీగా తగ్గుముఖం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆయన అంచనా వేసినట్టుగానే మార్చి 16 నుంచి కరోనా వైరస్ ప్రభావిత రోగుల సంఖ్య తగ్గుతుందని ఆయన గుర్తుచేశారు.

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరు వైరస్ ను అదుపు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే రోజు రోజు నమోదయ్యే కేసులను పరిశీలిస్తూ.. రోజు రోజుకీ వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతానికి అయితే కోవిడ్ బలహీనపడుతుందని సంకేతాలు వచ్చాయని అన్నారు. మీడియా వారు అనవసరంగా సామాన్య ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని అవగాహన కలిగించాల్సిన వారే ఇలా భయపెట్టడం సరికాదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: