దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  కానీ కొంత మంది జనాలకు దీనిపై సరైన అవగాహన లేకనో.. లేదా అత్యవసర పని ఉందని చెప్పి బయట తిరుగుతున్నారు.   దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి రాగా, కొందరు ఆకతాయిలు మాత్రం నిబంధనలను పట్టించుకోకుండా, రోడ్ల పైకి వచ్చి పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తుండగగా పోలీసులు తమ లాఠీలకు పని కల్పించారు. ఈ నేపథ్యంలో లాఠీలు ఒకరి తర్వాత ఒకరిని కొడితే మరి కరోనా వారికి సోకదా అని నెటిజన్ల నుంచి పోలీసులకు సవాళ్లు వచ్చాయి. దాంతో పోలీస్ అధికారులు దీనికో చక్కని టెక్నిక్ కనుగొన్నారట.  

 

ఖాళీగా కనిపిస్తున్న రహదారులపైకి దూసుకొస్తున్న యువతపై అదుపు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు మరో సమస్య ఎదురైంది. కొంత మంది ఆకతాయిలు అసలు రోడ్డు ఎలా ఉన్నాయి.. ఇంత నిర్మానుష్యంలో మనం స్పెషల్ గా ఉండాలని టిక్ టాక్ లు కూడా చేయడం ఆరంభించారు.. దాంతో ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత సీరియస్ గా కరోనా గురించి కేర్ తీసుకుంటే ఇలా చేసే వాళ్ల తాట తీసేందుకు పోలీసులు సిద్దమయ్యారు.

 

కాకపోతే ఒకసారి లాఠీతో ఒకరిని కొట్టిన తరువాత, మళ్లీ దాన్ని తిరిగి వినియోగిస్తే, కరోనా వ్యాప్తికి సహకరించినట్టు అవుతుంది. దీంతో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన న్యూఢిల్లీ పోలీసులు, తమ లాఠీలను శానిటైజర్ తో పరిశుభ్రం చేస్తున్నారు. లాఠీలను శుభ్రం చేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 'ఫుల్ తయ్యారీ' అని క్యాప్షన్ పెట్టారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: