ఇతర దేశాల సంగతి ఏమో గాని మన దేశంలో మాత్రం వడ్డీ వ్యాపారాలు ఎక్కువ. అన్ని విధాలుగా కూడా వడ్డీ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలు గా సాగుతూ ఉంటాయి. చాలా మంది తమ వద్ద డబ్బులు ఉంటే మాత్రం కచ్చితంగా వడ్డీ వ్యాపారాల కోసం ఇస్తూ ఉంటారు. దీని ద్వారా ఎందరో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. చాలా మందికి దేశంలో వడ్డీ వ్యాపారం అనేది ప్రధాన ఆధారంగా ఉంది. ఇల్లు అమ్ముకున్న డబ్బులు, పొలం అమ్ముకున్న డబ్బులు, చిన్న చిన్న వస్తువులు అమ్మి దాచుకున్న డబ్బులు రూపాయి రెండు రూపాయల వడ్డీలకు ఇస్తారు. 

 

చాలా మందికి ఇదే ప్రధాన ఆధారం. గ్రామ స్థాయిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు కరోనా దెబ్బకు వడ్డీలు ఇచ్చిన వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విధాలుగా కూడా వాళ్ళకు చుక్కలు కనపడుతున్నాయి. ఊర్లో పనులు లేవు చాలా మందికి. పది వేలు 20 వేలు వడ్డీలకు ఇచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఏంటో అర్ధం కాని స్థితిలో ఉంది. కరోనా వైరస్ దెబ్బకు జనాలను బయటకు వెళ్ళనివ్వడం లేదు. దీనితో వడ్డీలు తీసుకున్న వాళ్ళను గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది. వాళ్లకు ఎప్పుడు పనులు వస్తాయో చెప్పలేరు. 

 

దీనితో ఇప్పుడు చాలా మందిలో ఆందోళన వ్యక్తమవుతుంది. అది లీగల్ కాదు, కేసు పెట్టలేరు. గట్టిగా అడిగితే తీసుకున్న వాడు ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటో అర్ధం కాదు. తాకట్టు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏమో గాని ఇప్పుడు ఏ తాకట్టు లేకుండా ప్రామిశరి నోటు  రాసుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు దాదాపుగా దారుణంగానే ఉంది. ఏమీ చెప్పలేని పరిస్థితి. గ్రామాల్లో ఇలా వడ్డీలకు తమ వద్ద ఉంచుకున్న డబ్బులను ఇచ్చి పూట గడవక ఇబ్బంది పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: