కరోనా వైరస్ ఇప్పుడు కట్టడి అవ్వడం అనేది చాలా కష్టంగా కనపడుతుంది. ఊహించని విధంగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. కరోనా వైరస్ వ్యాపించడం ఎలా వ్యాపిస్తుందో అది ఏ విధంగా విస్తరిస్తుందో కూడా ఎవరికి అర్ధం కాని పరిస్థితి. దాన్ని మనం అదుపు చెయ్యాలి అంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చెయ్యాలి. దూరం పాటించడమే కాదు, ఒకరి వస్తువులను మరొకరు పట్టుకోకుండా ఉండటం కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి మార్గం. కరోనా వైరస్ అనేది ఊహకి అందని ప్రళయం గా చెప్తున్నారు అందరూ. వైద్యులు, నిపుణులు అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. 

 

ఇది పక్కన పెడితే కరోనా వైరస్ కి ఇప్పుడు కొత్త లక్షణాలను వైద్యులు గుర్తించారు. కరోనా వైరస్ లక్షణాలు ఇన్నాళ్ళు కూడా... జలుబు చేయడం, జ్వరం రావడం తో పాటుగా తల నొప్పి ఊపిరి ఆడకపోవడం వంటివి ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కొత్తగా వాసన తెలియకపోవడంతో పాటుగా మూత్రం పచ్చగా ఉండటం కూడా అని చెప్పినట్టు సమాచారం. అలాగే మలం కూడా నల్లగా వస్తుంది అని చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే కరోనా వైరస్ మరో లక్షణం విరోచనాలు అవ్వడం. విరోచనాలు అయినా సరే కరోనా వైరస్ ఉన్నట్టే అని కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది అంటున్నారు. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు మరో విషయం కూడా వైద్యులు చెప్పారు. కరోనా వైరస్ కొత్త లక్షణం అసలు ఏ లక్షణాలు బయటపడకపోవడం అని కూడా చెప్తున్నారు. మనకు ఏ తేడా తెలియదని మరణం కూడా ఉన్నపళంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 శాతం మందికి ఇలాగే బయటపడింది అని అంటున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండి ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది అంటున్నారు వైద్యులు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: