అమెరికాలో ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది. ఆ దేశంలో 50 రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. అక్కడ అన్ని విధాలుగా కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని కూడా దింపింది. అయినా సరే అక్కడ మాత్రం కట్టడి అవ్వడం లేదు. దేశంలో ఇప్పుడు కరోన వైరస్ నేపధ్యంలో కర్ఫ్యూ వాతావరణం విధించినట్టే కనపడుతుంది. సైన్యాన్ని కూడా భారీగా దింపారు. ప్రజలను ఎక్కడిక్కడ బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అయినా సరే సాధ్యం కావడం లేదు. జనాలు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతున్నారు. 

 

కరోనా వైరస్ కట్టడి చేయడానికి అవసరం అయితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా జారీ చెయ్యాలని అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. కరోనా వైరస్ విషయం లో అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల సహాయం కోరుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటిస్తుంది అనే వార్తలు అక్కడి ప్రజల ను కలవార పెడుతున్నాయి. అక్కడ ప్రజలు అందరూ నిత్యావసర సరుకుల కోసం కంగారు పడుతున్నారు. అక్కడ కరోనా వైరస్ కట్టడి అయ్యే అవకాశం లేదనే విషయం జనాలకు కూడా అర్ధమైనట్టే కనపడుతుంది. 

 

అందుకే ఇప్పుడు నిత్యావసర సరుకుల కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న సూపర్ మార్కెట్ లో భారీగా దోపిడీ లు జరుగుతున్నాయి. వేలాది సూపర్ మార్కెట్స్ లో దోపిడీలు జరుగుతున్నాయి. ప్రజలు అందరూ కూడా ఒక్కసారిగా వెళ్లి వాటి మీద పడటం ఇప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. నిత్యావసర సరుకులను భారీగా దోచేస్తున్నారు. దీనితో నాలుగు అయిదు రాష్ట్రాల్లో పరిస్థితులు భారీగా దిజారినట్టే కనపడుతుంది. అక్కడ ప్రజలు అందరూ కూడా డబ్బుల దొంగతనాలకు కూడా పాల్పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: