కరోనా వైరస్ రాకుండా ఉండాలి అంటే సామాజిక దూరం పాటించడం అనేది చాలా అవసరం. సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్ మనకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది ఆత్మగౌరవం ఉన్న జబ్బు. మనం పిలిస్తే మన వద్దకు వస్తుంది గాని మనం పిలవకపోతే మాత్రం కచ్చితంగా రాదు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి మనం బయటపడటం అనేది పెద్ద విషయం అసలు కాదు. కరోనా వస్తే చస్తారు అనే భయం కూడా అంత కరెక్ట్ కాదు. మనకు అది విషమించే అవకాశాలు చాలా తక్కువ అని కొందరు అంటున్నారు. దరిద్రం అడ్డం తిరిగితేనే అని అంటున్నారు. 

 

అయితే కరోనా వైరస్ విషయంలో మనం ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలు, నిపుణులు సామాజిక దూరం పాటిస్తే అది మన వద్దకు రాదు అని చెప్తున్నారు. సామాజిక దూరం ఒక్కటే కాదు... ఫిజికల్ దూరం కూడా చాలా అవసరం అని అంటున్నారు. మన దేశంలో ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ. అంటే అది తప్పు కాదు గాని ఎక్కువగా ఉంటాయి మన దేశంలో. అది కట్టడి కావాలి అంటే మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ముద్దు మురిపం అనేది మంచిది కాదు అనేది నిపుణులు చెప్తున్న మాట. 

 

నువ్వు ఎక్కడో విమానంలో తిరిగి వస్తావు నీకు ఎవడో అంటిస్తాడు. అది వచ్చింది అని నీకు తెలియదు. ఇంటికి వెళ్లి భార్య నుదుటి మీద ఒక ముద్దు, పిల్లల బుగ్గల మీద తలో ముద్దు పెడితే అస్సాం మినహా మరొకటి ఉండదు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండటం అనేది చాలా అవసరం. ముందు కరోనా రాకుండా ఉండాలి అంటే దాని మీద అవగాహన అనేది చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: