ఆ మద్య కరోనా వైరస్ ఎఫెక్ట్ తో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి.  మటన్ పై ఈ ఎఫెక్ట్ చూపించకున్నా.. చికెన్, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ వస్తుందని అన్నారు.  దాంతో చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి.  ఎంతగా అంటే కొన్ని ఫౌల్ ట్రీ ఫామ్ వారు ఫ్రీగా కోళ్లను పంచిపెట్టారు.  ఒక్క రూపాయికి అమ్మిన పరిస్థితి ఏర్పడింది.  కరోనా కారణంగా పడిపోయిన చికెన్‌ ధరలు లాక్‌డౌన్‌తో మళ్లీ పెరిగాయి. ఐదురోజులక్రితం కోడి ధర కిలో రూ.20 ఉంది. అకస్మాత్తుగా డిమాండ్‌ పెరిగి కోళ్లకోసం జనం ఎగబడుతున్నారు. దీంతో కోళ్ల ధర ఒక్కసారిగా పెంచేశారు.

 

వారంరోజులక్రితం బ్రాయిలర్‌ కోడి మూడు కిలోలు రూ.100 అయినా కొనేవారు లేరు.సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించడంతో మాంసపు దుకాణదారులు అమాంతం ధరలను పెంచారు. హైదరాబాద్ లో ఆదివారం కిలో చికెన్ ధర రూ.240కి చేరింది. మరి కొన్ని చోట్ల రూ.200 నుంచి 220 మధ్య అమ్మారు. హైదరాబాద్ లో కిలో మటన్ రూ. 600 నుంచి 700 మధ్య ఉండేది. ఆదివారం ఏకంగా రూ.800కి అమ్మారు.

 

అదే విధంగా రవ్వలు,బొచ్చల చేపల ధర కిలో రూ.110 నుంచి 120 ఉండేది. దానిని ఏకంగా రూ.180 నుంచి రూ.200 వరకు పెంచారు.   దీంతో మాంసపు ప్రియులు ఆశ్చర్యపోయారు. కానీ అంతా ఇంట్లోనే ఉండడంతో రేటు పెరిగినా తప్పకుండా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కావడంతో కొనుగోలు చేశారు.  ఏది ఏమైనా కరోనా ప్రభావం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ జనాలు పిచ్చెక్కి పోతున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: