కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాన్‌డౌన్ ఎనిమిదవ రోజుకు చేరుకుంది.  ప్రపంచ జీవన వ్యవస్థను అస్తవ్యస్థమవుతుంది.  రోజు రోజుకీ మరణాలు, కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.  అయితే ఈ కరోనా ని రూప మాపాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఉండాలని చెబుతూనే ఉన్నారు.  కానీ ఈ నియమాలు మాత్రం ఎవ్వరూ పాటించడం లేదు.  లాక్‌డౌన్‌పై పలు వదంతులు, అంచనాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో 21 రోజుల లాక్డౌన్ గడువును పొడిగించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌పై  షాకింగ్ అధ్యయనం ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

 

5 రోజుల సడలింపులతో నాలుగు దశల్లో మూడు లాక్ డౌన్లు అవసరమని కేంబ్రిడ్జ్ పరిశోధనలు చెబుతున్నాయి.  భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  పాటిస్తున్న లాక్ డౌన్ 21 రోజులు కాదు, 49 (21+28) రోజులకు పొడిగిండాలని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకీ చెందిన భారత సంతతి పరిశోధకులు చెబుతున్నారు.  ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఉన్నప్పటికి ప్రజలు ఎవరు సరైన పద్దతి పాటించడం లేదని అంటున్నారు.  మార్చి 25న లాక్‌డౌన్ విధింపు, ప్రతి ఒక్కరినీ ఇళ్లకు పరిమితం చేయడం లాంటి పరిణామాల అనంతరం జరిగిన గణిత గణనల ఆధారంగా ఈ అంచనాలకు వచ్చినట్టు వారు చెప్పారు. 

 

ఈ మూడు లాక్‌డౌన్‌లు అయిదు రోజుల  సడలింపులతో అమలు కావాలని సింగ్, అధికారి తెలిపారు. నాలుగవ దశలో పాజిటివ్ కేసుల 10 కంటే తక్కువకు వస్తుంది. 21నుండి 49 రోజుల కాలంలోమరణాల రేటు గణనీయంగా  తగ్గుతుందని తమ అధ్యయనంలో తేలిందన్నారు.  73 రోజుల వ్యవధిలో  మరణాలు 2,727గా  వుంటాయని,  రెండవ దశలో 11 కి,  మూడవ దశలో ఆరుకి, నాలుగ దశలో నాలుగుకు పడిపోతుందని  భావిస్తున్నట్టు చెప్పారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: