ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల ఇప్పటికే ఎనిమిది లక్షలకు చేరాయి. రోజు రోజుకు కరోనా వైరస్ షేర వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధిని అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాలల్లో ఈ మహమ్మారిని అరికట్టడానికి ఐసోలేషన్ వార్డులను నిర్వహిస్తున్నారు. కొందరు కోవిడ్ నివారణకు విరాళాలను అందిస్తే మరి కొందరు వారికీ ఉన్న హోటళ్లను, కాలేజిలని ఐసోలేషన్ వార్డులుగా రూపొందించి వారికి అందజేస్తున్నారు.

 

తాజాగా జోనల్‌ రైల్వే మేనేజర్లందరికీ రాసిన ఒక లేఖలో కోవిడ్‌ 19 బాధపడుతున్న వారికి చికిత్సను అందించేందుకు ముందుగా 5వేల రైల్వే బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. మెుత్తం మీద 3.2 లక్షల బెడ్స్ ను అందుబాటులో ఉంచగలదని మంగళవారం రోజు భారతీయ రైల్వే బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
 


దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం తెలంగాణాలోని సికింద్రాబాద్ లో 486 బోగిలను ఏర్పాటు చేయాలన్నారు. ముంబై ప్రధాన కార్యాలయం సెంట్రల్ రైల్వేలో 482 బోగిలను ఐసోలేషన్ కోచ్ లుగా మార్చటానికి కేటాయించింది. దీనికి సంబంధించిన వివరాలను  రైల్వే బోర్డు వెల్లడించింది. అయితే మెుత్తం 20వేల బోగిల్లలో అవసరానికి తగ్గినట్టుగా 3.2 లక్షల బెడ్స్ ను కలిగి ఉంటాయన్నారు. ఇప్పటికే 5 వేల బోగిలను ఐసోలేషన్ కోచ్ లుగా మార్చబడతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 

ఈ 5 వేల బోగీల్లో పూర్తి వసతులతో కూడిన 80వేల బెడ్స్ ఉంటాయి. కనీసం ఒక కోచ్ లో 16 బెడ్స్ ను కలిగి ఉంటాయని రైల్వే బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. నాన్ ఎసి ఐపిఎఫ్ స్లీపర్ కోచ్ లను మాత్రమే ఐసోలేషన్ కోచ్ లుగా మార్చటానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఐసోలేషన్ లో ఉంచడం వలన కొంత వరకు ఈ వైరస్ ను అరికట్ట వచ్చునన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: