క‌రోనా మ‌న దేశంలో జోరుగా విజృంభిస్తోంది. క‌రోనా ప్ర‌ళ‌యాన్ని ముందే ఊహించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా క‌రోనా మాత్రం ఆగ‌డం లేదు. జ‌న‌తా క‌ర్ఫ్యూతో ప్రారంభ‌మైన క‌రోనా క‌ట్ట‌డి ప్ర‌య‌త్నాలు ఇప్పుడు ఏకంగా దేశ‌వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్ర‌క‌టించే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. ఇక బుధ‌వారం ఉద‌యం అప్‌డేట్స్ చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మేలా ఉన్నాయి.

 

మంగ‌ళ‌వారం ప‌లు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెర‌గ‌డంతో బుధ‌వారం ఉద‌యంతో క‌రోనా పాజిటివ్ కేసులు ఏకంగా 1624 కు చేరుకుంది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 47 చేరుకున్నాయి. ఇక మ‌హారాష్ట్ర‌లో 302, కేర‌ళ‌లో 241, త‌మిన‌ళ‌నాడులో 124, ఢిల్లీలో 120, యూపీలో 104, క‌ర్నాక‌ట‌లో 101, హ‌ర్యానాలో 43, పంజాబ్‌లో 41, బెంగాల్‌లో 27, బిహార్‌లో 21, హిమాచ‌ల్ ప్ర‌దేశ్లో 3 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మ‌ర‌ణాలు అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 10 ఉన్నాయి. ఇక అగ్ర రాజ్య‌మైన అమెరికాలో నిన్న ఒక్క రోజు 865 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 

 

ఈ ప‌రిస్థితి చూస్తుంటే మ‌న దేశంలో కూడా ఉహ‌ల‌కు అంద‌ని ప్ర‌ళ‌యం క్రియేట్ అవుతుందా ? అన్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లు క‌రోనా ప‌రిస్థితి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎప్ప‌ట‌కి అమ‌లులోకి వ‌స్తుందో ?   ఎప్పుడు వ్య‌వ‌స్థ‌లు అన్ని సెట్ అవుతాయో ?  కూడా తెలియ‌డం లేదు. ప్ర‌స్తుతానికి ప్ర‌జ‌లు అంద‌రు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే మిగిలి ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: