ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రాయల సీమ కడపజిల్లా లో రౌడీయిజం కన్నా ముఖ్యం గా ఎన్నో ప్రముఖ దేవాలయాలు దర్శనమిస్తున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కొండ రామస్వామి దేవాలయం... పుష్పగిరి, గండి మహా క్షేత్రం, సౌమ్యనాథ దేవాలయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మహిమలున్న ప్రముఖ దేవాలయా లు కనిపిస్తాయి. అందుకే  కడపకు చాలా ప్రత్యేకత ఉంది.. ఇకపోతే కడపలో ప్రసిద్ధి దేవాలయం అంటే ప్రముఖ దేవాలయం ఉంది. 

 

 

 

అదే చారిత్రాత్మక దేవాలయం అంటే గుర్తొచ్చే దేవాలయం ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం. ఈ దేవాదాలయం ప్రపంచంలోకి పెద్ద దేవాలయం..కేవలం ఇద్దరు మాత్రమే ఈ దేవాలయాన్ని నిర్మించార ని ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి. ఒంటిడు, మిట్టాడు అనే ఇద్దరు స్నేహితులు ఈ దేవాలయాన్ని నిర్మించారట. 

 

 

 

 

అలా నిర్మితమైన ఈ దేవాలయంలో రాముడు కొలువై ఉంటాడు. దేవాలయంలో ఒక శిలపై మూడు విగ్రహాలు చెక్క పడ్డాయి. అందుకే ఈ నగరానికి ఏకశిలా నగరం అని పేరు కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రపంచంలో ఖన్నా అతి పెద్ద రథం కూడా ఇక్కడే ఉండటం విశేషం. ఇకపోతే ఇక్కడ స్వామివారికి ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. 

 

 


ప్రతి ఏటా శ్రీనామనవమి రోజు ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తొమ్మిద రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ తొమ్మిది రోజులు ఒక్కో వాహనం పై స్వామివారు ఒంటిమిట్ట పురవీధుల్లో ఊరేగింపు గా దర్శనమిస్తారు. ఆ దృశ్యాన్ని చూడటానికి భక్తులు చాలా మంది అక్కడకి వస్తుంటారు. అలా లక్షల మంది శ్రీరాముణ్ణి దర్శించుకుంటూ స్వామివారిని దర్శించుకుంటారు. అది ఆ ఆలయ ప్రత్యేకత... ఇప్పుడు ఏకంగా ఆంద్రప్రదేశ్ భద్రాచలం గా పిలవబడుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ కార్యక్రమాలు జరగుతున్నాయి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: