ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు అందరిని గుర్తిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళ్ళిన ప్రతీ ఒక్కరిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. వైరస్ సోకితే ఏదో జరుగుతుంది అనే భయం వద్దని ఆయన సూచించారు. రెండు రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని జగన్ అన్నారు. వైరస్ సోకితే ఏదో జరుగుతుంది అనే భయం వద్దని అన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన అందరికి కరోనా వైరస్ సోకింది అని జగన్ ఈ సందర్భంగా అన్నారు. 

 

వారి సన్నిహితులను కూడా గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నామని... దేశాధినేతలను కూడా గుర్తించే పనిలో పడ్డామని అన్నారు. ఢిల్లీ వెళ్ళిన వచ్చిన వారిలోనే 70 కేసులు బయటపడ్డాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1085 మంది ఢిల్లీ మీటింగ్ వెళ్ళారని జగన్ పేర్కొన్నారు. వారిలో 585 మందిని టెస్ట్ చేసామని, 500 మందిని టెస్ట్ లు చేస్తున్నామని అన్నారు. 21 మందిని గుర్తించే పనిలో పడ్డామని అన్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాలంటరీగా వచ్చి లొంగిపోవాలని ఆయన కోరారు. 104 కి ఫోన్ చెయ్యాలని సూచించారు. 

 

 

కరోనా వైరస్ జ్వరం లాంటిదే అని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెంటనే తగ్గిపోతుందని ఇంటికి వెళ్లి రావొచ్చని అనవసరంగా ఎవరూ భయపడవద్దని, అది ఏదో తప్పు కాదని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మొత్తం 87 కేసులు నమోదు అయ్యాయి అని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి సంబంధీకులు కూడా స్వచ్చందంగా వచ్చి లొంగిపోవాలని జగన్ విజ్ఞప్తి చేసారు. 81 శాతం కేసులు ఇళ్ళల్లో ఉండి నయం చేయించుకునే పరిస్థితి ఉందని... 14 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలని ఆయన అన్నారు. చాలా కేసులు నయం అయిపోతున్నాయని వ్యాఖ్యానించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: