కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు తప్పు చేస్తున్నట్టే భారత్ కూడా తప్పు చేస్తుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ అనేది చాలా ప్రమాదకరం అనే విషయం మన దేశానికి అర్ధమవుతున్నా మన పాలకుల్లో మాత్రం మార్పు రావడం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే అది రెచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని దాని మీద పోరాటం చెయ్యాల్సిన అవసరం ఉంది. 

 

ఈ విషయాన్ని మన దేశం గ్రహించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని అది ఏ విధంగా అయినా ప్రమాదంగా మారుతుందని చిన్న తేడా వచ్చినా సరే ప్రజలు పిట్టల్లా రాలి పోవడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ అనేది ఇప్పుడు మానవ జాతి మనుగడకే ప్రశార్ధకంగా మారిన విషయం కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అందరూ అంటున్నారు. భారత్ ఇప్పుడు భారీగా కరోనా మీద పోరాటానికి నిధులు ఇవ్వాలని అంటున్నారు. 

 

చాలా మంది వైద్యులకు పరికరాల కొరత ఉందని కాబట్టి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్య రంగం మీద ఇప్పుడు భారీగా పెట్టుబడులు పెట్టకపోతే మాత్రం నష్టపోవడం ఖాయమని అంటున్నారు. మన దేశం ఇప్పుడు ప్రమాదం అంచున ఉందని ఇప్పుడు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే చెల్లించే మూల్యం ఊహకు కూడా అందే అవకాశం ఉండదు అంటున్నారు. వెంటనే దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలను మన దేశం కేటాయించాలి అంటున్నాయి పలు వర్గాలు. కరోనా ఇప్పటికే నష్టం చేస్తుందని ఇంకా చెయ్యకుండా చూడాలని అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: