ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. దీని బారిన పడిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలు దాటి పోయింది. ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య 50 వేలు దాటింది. దీని విజృంభణ పుంజుకోవడంతో చాలా దేశాలు అప్రమత్తం అవుతున్నాయి.

 

 

కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సగం ప్రపంచం ఇప్పుడు లాక్ డౌన్ తోనే ఉంది. అయితే కొన్ని దేశాల్లో జనం మాత్రం ఈ లాక్ డౌన్ ను సీరియస్ తీసుకోవడం లేదు. చాలా లైట్ గా తీసుకుంటూ రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు.

 

 

దీంతో విసిగిపోయిన దేశాలు కొన్ని కఠిన చర్యలకు దిగుతున్నాయి. అలాంటి పరిస్థితే ఫిలిప్పీన్స్ లో ఉంది. ఈ దేశంలో లాక్‌డౌన్‌ అమలు కాకుండా అడ్డుపడేవారిని కాల్చి చంపేయాలని అధ్యక్షుడు రాడ్రిగో డెటెర్టె భద్రతా దళాలను ఆదేశించారు. ఈ దేశంలో ఇప్పటికే ఈ దేశంలో సగం మంది స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: