ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కి చికిత్స చేయడం అనేది సాధారణ విషయం కాదు. దీనికి చికిత్స చేయడం అనేది చాలా కష్టం. అది నయం అయ్యే వ్యాధి అయినా సరే ఒక్కసారి వైద్యులకు సోకింది అంటే మాత్రం ఇబ్బంది పడటం ఖాయం. చావుని ముందు పెట్టుకుని చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. అలా జరుగుతుంది ప్రస్తుతం. మన దేశంలో కరోనా వైరస్ విషయంలో ఇప్పుడు వైద్యులు భయపడే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కట్టడి కావడం లేదు. 

 

ఇది ఇలా ఉంటే ఇప్పుడు కరోనా వైరస్ కి చికిత్స చేయడానికి వైద్యుల కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదనే ప్రచారం జరుగుతుంది. తమ వారి ప్రాణాల విషయంలో వారిలో భయం ఎక్కువగా ఉందని వాళ్ళు అందుకే చికిత్స చేయడానికి వెనకడుగు వేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అంటున్నారు. చాలా మంది వైద్యులు ఇంటికి వెళ్లి చాలా రోజులు అయింది. ఇక తమ వారికి ఆలనా పాలానా చూసుకోలేని పరిస్థితుల్లో వైద్యులు ఉన్నారు. తమ కుటుంబ సభ్యుల గురించి కూడా వైద్యుల్లో ఆందోళన ఉంది. వైద్యులు చాలా మంది ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. 

 

కొంత మంది వైద్యులు ఇప్పుడు బయటకు చెప్పలేక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తడి ఉండటం తో చాలా మంది వైద్యులు పని చేయడానికి ముందుకి రావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. వారికి ప్రభుత్వాలు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఒక్కసారి వైద్యులు గనుక చికిత్స చేయకపోతే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం చాలా కష్టం అని వ్యాఖ్యానిస్తున్నారు. మన దేశానికి కరోనా ఇప్పుడు పెద్ద సవాల్ కాబట్టి వైద్యులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: