తెలంగాణ‌లో క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా బాధితులు 400కు చేరువ‌లో ఉండ‌గా ఇప్ప‌టికే 11 మంది చ‌నిపోయారు. ఇక క‌రోనాపై సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ తెలంగాణ‌లో క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు వివ‌రించారు. క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. వేరే దేశంలో పుట్టిన క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి విష‌యంలో మ‌న రాష్ట్రం, మ‌న దేశం తిరుగులేని విజ‌యం సాధించాయి. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన సూచ‌న‌లు అన్నింటిని మ‌నం తిరుగులేకుండా పాటించాము అని చెప్పారు.

 

తెలంగాణ‌లో ఫ‌స్ట్ బ్యాచ్‌లో క‌రోనా సోకిన వాళ్లు క్షేమంగానే ఉన్నార‌ని.. అయితే ఎప్పుడు అయితే నిజాముద్దీన్ పీడ వ‌చ్చి ప‌డిందో అప్ప‌టి నుంచి వాళ్ల ద్వారా వాళ్ల కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోక‌డం అక్క‌డ నుంచి మ‌రొక‌రికి క‌రోనా సోక‌డంతో ఇలా క‌రోనా వైర‌స్ కేసులు రాష్ట్రంలో ఎక్కువ‌య్యాయ‌ని కేసీఆర్ చెప్పారు. మ‌న‌దేశంలోనూ.. మ‌న రాష్ట్రంలోనూ క‌రోనాపై పోరాటంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యామంటోన్న కేసీఆర్ అమెరికా లాంటి దేశాలే చేతులు ఎత్తేశాయంటున్నారు. అగ్ర‌రాజ్యమైన అమెరికాలో ఈ రోజు చేతులు ఎత్తేసి.. శ‌వాల గుట్ట‌లే క‌నిపిస్తున్నాయ‌న్నారు. ఇక తెలంగాణ‌లో 
రేపు 258 క్వారంటైన్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని కేసీఆర్ తెలిపారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: