ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 మంది మరణించారు. వీరెవరికీ ట్రావెల్ హిస్టరీ లేదు.. దాంతో ముంబాయి వాసుల గుండెల్లో గుబులు పుడుతుంది.  ప్రస్తుతం కరోనా ప్రభావం మహారాష్ట్రలో ఎక్కువ ఉందన్న విషయం తెలిసిందే.  దేశంలో 24 గంటల్లో కొత్తగా 508 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 10 గంటల వరకు వివిధ రాష్ట్రాలు వెల్లడించిన సమాచారం బట్టి దేశంలో మొత్తం కేసులు 5,200కు చేరాయి. మరణాల సంఖ్య 162కు పెరిగింది. మహారాష్ట్రలో కరోనా కేసులు దేశంలోనే తొలిసారిగా వెయ్యి కేసులు దాటాయి.

 

కరోనా కాటుకు పుణెలో మరో ముగ్గురు, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 52 మంది బలవ్వగా ఒడిసాలో తొలి కరోనా మరణం నమోదయింది.   ఒక్క ముంబై నగరంలోనే అత్యధిక కేసులు ఉన్నాయి.  ముంబై మహానగరంలో స్లమ్ ఏరియాలు అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే.  స్లమ్ ఏరియాల్లో కరోనా వ్యాపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.  ఇప్పటికే అక్కడ పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయి. ముంబై మహానగర మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని స్లమ్ ఏరియాల్లో దృష్టి పెట్టింది.

 

అక్కడ నమోదవుతున్న పాజిటివ్ కేసులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.  కాగా, తాజాగా బిఎంసి ఓ ప్రకటనను విడుదల చేసింది.  ముంబై నగరంలో కరోనా వైరస్ కమ్యూనిటీ  స్ప్రెడింగ్ అవుతున్నట్టు ప్రకటించింది.  అయితే   జనసాంద్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాలపైన దృష్టి సారించి కరోనాను కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

 

 

రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: