కరోనా ప్రపంచమంతా వ్యాపించింది. అన్ని దేశాలనూ వణికిస్తోంది. నలుగురు కలిసి ఉండటమే ఇప్పుడు నేరంగా మారింది. అలాంటి పరిస్థితుల్లోనూ ఆ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా ఏదో స్థానిక ఎన్నికలో ఒక ప్రాంతానికి పరిమితమైనవో కాదు. దేశమంతా జరిగే పార్లమెంటు ఎన్నికలు. ఇంతకీ ఇదెక్కడో తెలుసా...?

 

 

దక్షిణ కొరియాలో.. మరి ఆ దేశంలో కరోనా అంతగా లేదేమో అనుకుంటున్నారా.. అదేమీ కాదు.. ఆ దేశంలో ఇప్పటి వరకూ 10 వేలకుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 214 మంది చనిపోయారు కూడా. ఏకంగా ఆ దేశం మంత్రి ఒకరు క్వారంటైన్ లో ఉన్నారు కూడా. అయినా సరే దక్షిణ కొరియాలో యథావిధిగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వచ్చే బుధవారం జరగనున్న ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి.

 

 

అయితే కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడం , ఎన్నికల అధికారులకు అన్ని రకాల రక్షణ పరికరాలు, మాస్కులు, సూట్ లు ఇవ్వడం చేస్తున్నారు. దక్షిణ కొరియాలో మొత్తం 14 వేల పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. జనం దూరంగా నిలుచునేలా మార్కింగ్ చేస్తున్నారు. ప్రజలు ఓటు వేయడానికి ఇబ్బంది ఉండదని భరోసా ఇవ్వడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

 

 

ఇప్పటికీ క్వారంటైన్ లో ఉన్న 450 మంది కోసం కూడా ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి నిర్దిష్టమైన ప్రదేశాలలో బూత్ లు ఏర్పాటు చేస్తున్నారు. వారికి పీపీఈలు ఇచ్చి పోలింగ్ బూత్ కు తీసుకువస్తారట. ఆయన కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని ఓటు వేస్తారు. కాగా వీరికోసం ఇప్పటికే పోలింగ్ మొదలు పెట్టారు. కరోనా కరోనాయే ఎన్నికలు ఎన్నికలే అంటున్న దక్షిణ కొరియా ధైర్యాన్ని చూసి ఇప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: