దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరొక రెండు వారాలు కొనసాగింపుకు నిర్ణయం తీసుకోవడంలో ఈ నెలాఖరి వరకు దేశ ప్రజలకు స్వీయ గృహ నిర్భంధం తప్పదు. మనిషి ప్రాణంతో పాటు దేశ ఆర్ధిక పరిస్థితి కూడ దిగ జారకుండా చూడాలి అన్న లక్ష్యంతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అన్న విషయమై ప్రస్తుతం ప్రధాని మోడీ మన దేశానికి సంబంధించిన అనేకమంది ప్రముఖ ఆర్ధిక శాస్త్ర వేత్తలతో చర్చిస్తూ ఈ ఉపద్రవం నుండి దేశాన్ని రక్షించే మార్గం ఏదైనా ఉందా అన్న ఆలోచనలు చేస్తున్నారు.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఇంగ్లీష్ పదాలకు కొన్ని దశాబ్ధాలుగా ఒక నిఘంటువుగా కొనసాగుతున్న ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లోకి కోవిడ్-19 కు సంబంధించి పదాలు వచ్చి చేరాయి. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కోవిడ్-19 కు సంబంధించి ప్రచారంలో ఉన్న పదాలను ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు. 


సెల్ఫ్- ఐసోలేట్, సెల్ఫ్- క్వారెంటైన్, షెల్టర్ ఇన్ ప్లేస్, సోషల్ ఐసోలేషన్ లాంటి పదాలు ఇప్పటి వరకు కరోనా సమయంలో అందరినోట వినిపిస్తున్న పరిస్థితులలో ఈ పదాలకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో స్థానం కల్పించి భవిష్యత్ తరాలకు ఈ పదాలకు అర్ధం తెలిసే విధంగా మార్పులు చేసారు. వాస్తవానికి సోషల్ డిస్టెన్సింగ్ అనే పదాన్ని 1957 లోనే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో స్థానం కల్పించారు. 


ఇది ఇలా కొనసాగుతూ ఉంటే కరోనా వైరస్ గాలిలో 13 అడుగుల వరకు వ్యాపిస్తుందని లేటెస్ట్ అధ్యయనాలు వస్తున్న పరిస్థితులలో ప్రపంచం ఉలిక్కి పడుతోంది. వాస్తవానికి పూర్వకాలంలో మసూచి ని (అమ్మవారు) గా పరిగణించే రోజులలో ఒక ఊరిలో ఉంటే ప్రజలు ఆ అమ్మవారు సోకిన వ్యక్తి కుటుంబాన్ని దూరం పెడుతూ ఊరికి పొలిమేర కట్టకు తీసుకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆ పద్ధతి పేరు మార్చుకుని క్వారెంటైన్ పద్దతిగా మారింది అని తెలియడంతో మన దేశంలో ఏ నాటినుంచో ఈ క్వారెంటైన్ అమలులో ఉంది అన్న విషయాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: