ఈ మద్య కరోనా ఎవ్వరిని వదలడం లేదు.  కరోనా ప్రబలి పోతుందని దేశంలో లాక్ డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు కరోనా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వస్తూ ప్రాణాంతకంగా మారిన విషయం తెలిసిందే.  దేశంలో రోజు రోజుకీ కేసులు , మరణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తమ సిబ్బందిలో ఒకరు కరోనా వైరస్‌ సోకి చెన్నైలో ప్రాణాలు కోల్పోయారని భారత విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది.

 

అయితే, ఈ విషయంపై ఆ సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.  ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తి విమాన నిర్వహణ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతనికి దాదాపు 50 ఏళ్లు ఉంటాయి. 'మా విమానయాన సంస్థలో పనిచేస్తోన్న ఓ వ్యక్తి చెన్నైలో కొవిడ్‌-19తో మృతి చెందినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం' అని ఇండిగో ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.

 

ఈ బాధాకర సమయంలో ఆయన కుటుంబానికి అండగా నిలబడతాం. ఆయన కుటుంబం వివరాలు తెలపకుండా గోప్యతను పాటిస్తాం' అని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానయన సంస్థకు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందడం దేశంలో ఇదే మొదటిసారి. 'ఇండిగో సిబ్బంది అందరికీ ఇది చాలా బాధ కలిగించే విషయం అన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: