దేశంలో కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పేద ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్న నేపథ్యంలో కేంద్రం వారికి తగు రీతిలో ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.  చాలా మంది పట్టణ వాసులు లాక్ డౌన్ ప్రభావంతో పల్లేబాట పట్టిన విషయం తెలిసిందే.  లాక్ డౌన్ తో కోట్ల నష్టం వాటిల్లిందని అంటున్నారు.. అన్ని ఆర్థిక వ్యవస్థలు స్తంభించి పోయాయి.  ఇదే, సమయంలో వెనుకబడిన వర్గాలను ఆదుకోవడానికి ఆయా రాష్ట్రాలు బియ్యం, ఇతర సరుకుల పంపిణీతో పాటు.. కొంత నగదును ప్రకటించాయి.

 

ఇక, ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం... జన్‌ధన్‌ ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నట్టు ప్రకటించింది.  అసలే కష్టాల్లో ఉన్నాం రా బాబో అంటుంటే.. సోషల్ మీడియాలో లేని పోని ప్రచారాలు కంటికిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.   జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం వేసిన సొమ్ము వెంటనే తీసుకోవాలి.. లేకపోతే వెనక్కి వెళ్లిపోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  దాంతో పేద ప్రజలు కొత్త టెన్షన్ లో పడిపోాయారు.

 

తాజాగా ఈ విషయంపై స్పందించిన స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా.. జన్‌ధన్.. ఖాతాదారులకి ముఖ్య విజ్ఞప్తి చేసింది. జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం వేసిన డబ్బులు వెంటనే తీసుకోకపోతే వెనుక్కి తీసుకుంటుందని సోషల్ మీడియాలో.. వస్తున్న అసత్య ప్రచారాలను ఖాతాదారుల నమ్మవద్దని తెలిపింది. ఇప్పుడైనా డ్రా చేసుకోవొచ్చని.. లాక్ డౌన్ తర్వాత ఎప్పుడైనా మీ ఖాతాలో డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు అని క్లారిటీ ఇచ్చింది ఎస్బీఐ. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: