సాధారణంగా నింధితులకు జైలు శిక్ష పడితే జైల్లో వేయడం ఆనవాయితీ.. కానీ కరోనా సృష్టిస్తున్న బీభత్సానికి అక్కడ ఓ నింధితుడికి జైల్లోకి రావడానికి నో చెప్పారు.  ఆశ్చర్యం అనిపించినా.. ఇప్పుడు ఈ సంఘటన చూసి వామ్మో కరోనా ప్రభావం మామూలుగా లేదుగా అంటున్నారు.  వివరాల్లోకి వెళితే.. దాదాపు యాబై కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏడో మెట్రోపాలిటన్‌ కోర్టు ముందు హాజరుపరిచారు.  జ్వరంగా ఉండటంతో ఆ నింధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. దీంతో క్వారంటైన్‌ చేయాలని వైద్య సిబ్బంది సూచించి అతని చేతిపై ముద్రవేశారు.

 

అయితే కోర్టు రిమాండ్‌ విధించడంతో పోలీసులు నేరుగా నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వెంటనే విస్తరిస్తున్న నేపథ్యంలో అక్కడి సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌లో నిందితుడికి జ్వరం ఉందని తేలడంతో వెనక్కు పంపించారు.

 

క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నట్లు ముద్ర ఉండడంతో హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సిబ్బంది తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  ఈ రోజు కూడా కింగ్ కోఠిలో ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే కరోనాని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుక మొన్న సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ని 30 వరకు పెంచిన విషయం తెలిసిందే. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: