ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కంటే, దాని మీద చేసే రాజకీయాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తి చెందకుండా కష్టపడుతుంటే, ఆ కష్టంపై టీడీపీ నేతలు విమర్శలు చేసే పనిలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటూ మరి తెలివిగా సలహాలు ఇస్తున్నట్లే ఇస్తూ....జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాజకీయం చేస్తున్నారు.

 

మొదట్లో కాస్త కరోనా వ్యాప్తిపై సలహాలు, సూచనలు ఇచ్చిన, ఇప్పుడు మరి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా అసలు అర్థంపర్ధం లేని విమర్శలు చేస్తూ, తనేదో నిజాలు చెబుతున్నట్లు ఫీల్ అయిపోతున్నారు. తాజాగా కూడా కరోనాపై జగన్, ప్రధానమంత్రికి నిజాలు చెప్పలేదని, అన్ని తప్పులే చెప్పారని అన్నారు. అలాగే నిమ్మగడ్డని పొగుడుతూనే, కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనర్ కనగరాజ్ తమిళనాడు నుంచి ఎలా వచ్చారని మాట్లాడారు. ఇంకా రాష్టంలోకరోనా మరణాలను దాచడం కీడు అని, కృష్ణా, గుంటూరు జిల్లాలు రెడ్ జోన్ లోకి వెళ్ళడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ విమర్శలు చేశారు.

 

అయితే ఇక్కడ బాబు చేసే విమర్శలకు అసలు అర్థమే లేదు. అసలు జగన్ కరోనా మరణాలను దాయగలరా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాని దాస్తే దాగేదా. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు రెడ్ జోన్ లోకి వెళ్ళడానికి కారణం, ఢిల్లీ మర్కజ్ యాత్ర. ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారితో, కరోనా కేసులు పెరిగాయి.

 

ఇక ప్రధానికి తప్పులు చెప్పారని అన్నారు. అలాంటి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వ హయాంలో నడిచాయి. కనగరాజ్ ఏపీలోకి ఎలా వచ్చారని అడుగుతున్నారు. అధికారులు రావడానికి ఎలాంటి  ఇబ్బంది ఉండదు. పైగా వాళ్ళు ఎప్పడు జాగ్రత్తలు పాటిస్తారు, కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. అయితే ఆ విషయాన్ని కూడా పట్టుకుని బాబు అండ్ బ్యాచ్ నాలుగు రోజుల నుంచి రాజకీయం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో రాజకీయం చేయడానికి ఏది దొరకక బాబు, చిన్న చిన్న వాటి మీద కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకునే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: