లాక్‌డౌన్‌ తో కరోనా కట్టడి విషయం ఏమో కానీ.. పేదలు మాత్రం ఆకలి కేకలు పెడుతున్నారు. అందుకే ఇలాంటి పేదలను ఆదుకునేందుకు మోడీ సర్కారు కోట్లు ఖర్చు చేస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్  వల్ల ఉపాధి కోల్పోయిన  పేదలను ఆదుకునేందుకు మోడీ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ఖర్చు వివరాలు ఓసారి చూద్దామా.. 

 

 

అందులో భాగంగా దాదాపు 32కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 28 వేల 256కోట్ల రూపాయలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 1.7లక్షల కోట్ల విలువైన ప్యాకేజీలో భాగంగా 19.86 కోట్ల మంది మహిళలకు లబ్ధి కలిగింది. 97శాతం మహిళలకు ప్రధానమంత్రి జన్ ధన్  యోజన ఖాతాల ద్వారా 9,930 కోట్ల రూపాయలు అందించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 

 

 

20 కోట్ల మంది మహిళల జన్ ధన్  ఖాతాల్లో నెలకు 500, పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 2వేలు జమ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించారు. సీనియర్ సిటిజన్స్ , దివ్యాంగులు, ఇతరులకు 14వందలా ఐదు కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ అయినట్లు కేంద్రం చెప్పింది. ఈ ప్యాకేజీ కింద నిర్మాణ, నిర్మాణేతర రంగాలకు చెందిన 35మిలియన్ల మంది కార్మికులు కూడా లబ్ధి పొందుతున్నారు. ఇది కచ్చితంగా చెప్పాలంటే మంచిదే.

 

 

అలాగే భారత్‌కూ బయటి నుంచి సాయం అందుతోంది. కొవిడ్ -19పై పోరాటం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు గతనెలలో ప్రకటించిన ప్యాకేజీని 3రెట్లు పెంచింది. సభ్యదేశాలకు 20బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 18న ఆరున్నర బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన ఏడీబీ మరో 13.5 బిలియన్ డాలర్ల నిధులు యాడ్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: