కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఏపీలో ప్రస్తుతం మహిళా రక్షణ విభాగంలో అదనపు ఎస్పీగా, సీఐడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేజీవీ సరిత, కరోనాపై పాడిన పాటను, ఏపీ పోలీసు శాఖ ప్రత్యేకంగా విడుదల చేసింది. కాగా, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎంతో మంది గేయ రచయితలు, సంగీత దర్శకులు కలిసి పాటలను తయారు చేశారు.  వద్దురా అన్న... బయటకు రాకురోయన్న... వద్దన్నా నువ్వు వస్తే... కాటేస్తుంది కరోనా" అంటూ ఈ సాగే పాట, ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఉంది.

 

కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను అడ్డు పెట్టారని, ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి వైరస్ బారిన పడవద్దని వినసొంపుగా సరిత ఆలపించారు.  ఏపీ డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్ నేతృత్వంలో కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు తమ పోలీసు శాఖ చేస్తున్న సేవల్లో భాగంగా, ఇది తన చిరు ప్రయత్నమని ఈ సందర్భంగా సరిత వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: