కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకి, ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడంలో టీడీపీ అధినేత చంద్రబాబు బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన లాక్ డౌన్ వల్ల  హైదరాబాద్ లో ఉండిపోయినా, అక్కడ నుంచే ఎప్పటికప్పుడు మీడియా సమావేశం పెట్టి ప్రజలకు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వానికి కూడా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కూడా.

 

ఇక బాబు కేంద్ర ప్రభుత్వానికి కూడా పలు సూచనలు ఇస్తూ లేఖలు రాస్తున్నారు. ఇంకా ఏపీ ప్రజలు ఏదైనా రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతుంటే, ఆయా రాష్ట్రాల సీఎంలకు కూడా లేఖలు రాసి, తెలుగు ప్రజలని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక బాబు చేసే విజ్ఞప్తులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ, తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాయి.

 

అలాగే తాజాగా పీఎంఓకు కూడా ఫోన్ చేసి పలు సూచనలు ఇచ్చారు. అదే సమయంలో ప్రధానితో మాట్లాడాలని కోరితే, ఆ వెంటనే మోదీకూడా, చంద్రబాబుకు ఫోన్ చేసి పలు సూచనలు తీసుకున్నారు. అయితే బాబు ఈ విధంగా ప్రజల కోసం వర్కౌట్ చేస్తూ, ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నా, జగన్ ప్రభుత్వం మాత్రం ఆ సూచనలని పట్టించుకోవడం లేదు.

 

ఇప్పటివరకు చంద్రబాబు జగన్ ప్రభుత్వానికి మీడియా ద్వారా, లేఖల ద్వారా పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే కొన్ని సమస్యలని కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఏవి   పట్టించుకోలేదు. పైగా బాబు రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. అన్నిచోట్లా బాబుకు అనుకూల స్పందన వస్తున్నా, ఒక్క ఏపీలో మాత్రం గట్టి దెబ్బ తగులుతుంది. ఏదేమైనా ప్రతిపక్షాల మాటలు ప్రభుత్వాలు పట్టించుకోవన్న సంగతి తెలిసిందే. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు కూడా అదే పని చేశారు. జగన్ ఇచ్చిన ఏ సలహా తీసుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: