ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాపించకుండా జగన్ సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన వారితో సంబంధం ఉన్న అందరి వివరాలు సేకరించి.. వారిని క్వారంటైన్ కు పంపుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5000 మందికి పైగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. వీరికి కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లు జనంలో తిరిగితే కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

 

 

అయితే చాలా మంది క్వారంటైన్ లో ఉండటాన్ని జైలుగా భావిస్తున్నారు. కానీ ఏపీ సర్కారు క్వారంటైన్లలో ఉన్న వారికి అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని చెబుతోంది. ఇటీవల క్వారంటైన్లలో ఉన్నవారి మెనూ ను కూడా మీడియాకు విడుదల చేశారు. ఇక ఇప్పుడు జగన్ సర్కారు క్వారంటైన్లలో ఉన్నవారికి మరో గిఫ్ట్ ప్రకటించింది. క్వారంటైన్ పూర్తి చేసుకుని వెళ్లిపోయేవారికి రూ. 2000 నగదు బహుమతి అందిస్తామని ప్రకటించింది.

 

 

ఈ మేరకు మంత్రి మోపిదేవి వెంకట రమణ ఓ ప్రకటన చేశారు. క్వారంటైన్‌లో ఉన్న 5190 మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. 14 రోజులు క్వారంటైన్‌ పూర్తయి బయటకు వచ్చిన వారికి మళ్లీ పాజిటివ్‌ వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. 14 రోజులు పూర్తయిన తరువాత కూడా మరో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని, మూడోసారి కూడా పరీక్షలు నిర్వహించిన తరువాతే వారిని ఇంటికి పంపుతామని చెప్పారు.

 

 

క్వారంటైన్‌లో ఉండి ఇంటికి వెళ్లే వారికి రూ.2 వేల సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని కోరారు. మహమ్మారి కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రజల నుంచి మరింత సహకారం కావాలని మంత్రి మోపిదేవి వెంటక రమణ కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: