ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సామాజిక మాధ్యమాలలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తాజాగా 'Likee' అనే ఓ ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ లో ఖాతా తెరిచారు. ఈ వీడియో షేరింగ్ యాప్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తారు. అలాగే కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడం తో పాటు... ఢిల్లీ ప్రభుత్వం కరోనా పై ఏ విధంగా పోరాడుతుందో వీడియో రూపంలో చెబుతున్నారు. కేజ్రీవాల్ తన మొట్టమొదటి Likee వీడియో సెషన్ లో... ఢిల్లీ సర్కారు ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటుందో అవన్నీ ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. అయితే ఈ ఫస్ట్ సెషన్ వీడియో కి రెండు కోట్ల వీక్షణలు లభించాయి.


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం అంతటా మే 3వ తారీకు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీ సమయంలో ఢిల్లీ ప్రజలంతా Likee యాప్ డౌన్లోడ్ చేసుకొని లైఫ్ హ్యాక్స్, హాస్యభరిత వీడియోలను వీక్షిస్తున్నారు అని తెలిసింది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఆ Likee యాప్ లో తన ఐడి ని క్రియేట్ చేసి ప్రజలకు బాగా దగ్గరవుతున్నారు. ఆయన ప్రొఫైల్ లో ఆయనకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి. అలాగే భవిష్యత్తులో జరిగే గవర్నమెంట్ ప్రెస్ మీట్స్ కూడా అరవింద్ కేజ్రీవాల్ Likee ఐడి లో ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి.


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, కేజ్రీవాల్ కలసి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోలు కూడా Likee ప్రొఫైల్ లో దొరుకుతాయి. ఈ సింగపూర్ ఆధారిత Likee యాప్ యొక్క ప్రతినిధి మార్క్ ఒంగ్ మాట్లాడుతూ... అరవింద్ కేజ్రీవాల్ లాగా ప్రతి ఒక్క ప్రముఖులు, వాటాదారులు ఈ విపత్కర సమయంలో ప్రజలకు అండగా నిలవాలని ఆయన అన్నారు.


ఇకపోతే అరవింద్ కేజ్రీవాల్ ఇంస్టాగ్రామ్, ఫేసుబుక్ తదితర సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఖాతా తెరిచిన Likee యాప్ భారతదేశంలో అత్యధికంగా డౌన్లోడ్ చేసిన యాప్స్ లలో నాలుగవ స్థానాన్ని సంపాదించింది. ఏది ఏమైనా టెక్నాలజీని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్న కేజ్రీవాల్ ప్లాన్స్ ఎప్పుడూ అదిరిపోయేలా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: