అనుకోని విపత్తు ఇప్పుడు ప్రపంచాన్ని ముంచెత్తింది. ప్రజలంతా కరోనా విలయతాండవానికి అతలాకుతలం అవుతున్నారు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ మొదట్లో ఏపీలో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ నిబంధనలతో పాటు ప్రభుత్వం కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేస్తోంది. ఇదే సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏపీ సీఎం జగన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోవడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ప్రతి ఇంటికి వెయ్యి రూపాయల చొప్పున నగదు పంపిణీ చేశారు. అలాగే నిత్యావసరాలు అందించడంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా జగన్ కల్పిస్తున్నారు. 

 

IHG

ఇంతవరకు బాగానే ఉన్నా, జగన్ క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులు ఈ విపత్కర సమయంలో  వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జగన్ కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉన్నారు. అయితే వీరిలో చాలామంది యాక్టివ్ గా ఉంటూ ప్రజల్లో తిరుగుతున్నా, కొంతమంది మంత్రులు మాత్రం అంటీ ముట్టనట్టు గా ఉంటున్నారు. ఇక ఇద్దరు మంత్రులు అయితే పూర్తిగా ఇళ్లకే పరిమితం అయిపోవడం చర్చనీయాంశమవుతోంది. వారే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీరంగనాథరాజు. ఈ ఇద్దరు మంత్రులు కరోనా సమయం నుంచి ప్రజలకు అందుబాటులో లేకుండా పరిమితం అయినట్లు తెలుస్తోంది. వీరు వయసు రీత్యా 60 సంవత్సరాలు దాటి ఉండడంతో, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇంటికే పరిమితం అయినట్టుగా వారి అనుచరులు చెబుతున్నారు. 

IHG


అయితే ప్రజల వారికి ఈ సమయంలో ఇబ్బంది ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అధికారాలులతో సమీక్షలు చేస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలను, అధికారులను, అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నా, వారు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో వారిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ధర్మాన కృష్ణదాస్ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదు. అయినా మంత్రి బయటకు వచ్చేందుకు భయపడుతున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు,ఎమ్యెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పినా కొంతమంది పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: