భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో 14000 కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 500కు చేరువలో ఉంది. దేశంలో కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో కరోనా పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1300 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో మర్కజ్ ప్రార్థనల వల్లే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 
 
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఇంటికే పరిమితమైన వారికి కూడా కరోనా సోకుతోంది. ఇరు రాష్ట్రాల్లో మర్కజ్ కు హాజరైన వారితో సంబంధం లేకపోయినా కొందరికి కరోనా సోకింది. వీరికి నోట్ల ద్వారా కరోనా సోకిందని వార్తలు వినిపిస్తున్నాయి. నోట్ల ద్వారా కరోనా సోకుతుందా...? సోకదా...? అనే ప్రశ్నకు కొందరు సోకుతుందని కొందరు సోకదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా సోకుతుందని భావించి చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం ఉన్న కరెన్సీ స్థానంలో స్టీరిలైజింగ్ నోట్స్ ( క్రిమిరహిత నోట్లు) ను ప్రవేశపెట్టే దిశగా చైనా ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా ప్రింట్ చేసే నోట్ల ద్వారా ప్రజలు కరోనా భారీన పడే అవకాశం ఉండదని చైనా చెబుతోంది. చైనా స్టీరిలైజింగ్ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఇతర దేశాలు కూడా ఇదే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఏపీలోని గుంటూరు జిల్లాలో, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందని వార్తలు వచ్చాయి. 
 
నోట్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఋజువయితే మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా కరెన్సీ నోట్ల విషయంలో చైనా తరహా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేంద్రం కరోనా కట్టడి చేయడానికి కఠిన చర్యలు చేపడుతోంది. కేంద్రం లాక్ డౌన్ అమలు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతున్నా వైరస్ వ్యాప్తి తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. లాక్ డౌన్ అమలుకు ముందు మూడు రోజుల్లో రెట్టింపు కేసులు నమోదయ్యాయని ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందడానికి ఆరు రోజులు పడుతుందని కేంద్రం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: