ప్రపంచ దేశాలను కరోనా వైరస్ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్ లో పుట్టిన వైరస్ విషయంలో అసలు నిజాలను, అసలు లెక్కలని చైనా దాచిందని... చైనా డబుల్ గేమ్ ఆడుతోందని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చైనా దొంగ లెక్కలు చెబుతోందని... వాస్తవాలను దాస్తోందని పలు దేశాల అధ్యక్షులు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
తాజాగ చైనా దేశంలో 82,341 కేసులు నమొదయ్యాయని... కొత్త కేసులు 46.... 3342 మంది మృతి చెందారని... 77,892 మంది రికవరీ అయ్యారని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసులు 1107 అని... క్రిటికల్ కేసులు 95 అని... నివేదిక ఇచ్చింది. మరుసటిరోజు ఈ లెక్కల్లో మార్పులు చేసి చైనా మరో నివేదిక ఇచ్చింది. కొత్త నివేదికలో చైనా 4,630 మంది చనిపోయినట్లు పేర్కొంది. ఈ మరణాలలో కొత్త మరణాలు 1230 అని చైనా పేర్కొంది. 
 
చైనా ముందు రోజు 1107 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొని... ఒక్క రోజులో మాట మార్చింది. యాక్టివ్ కేసుల కంటే కొత్తగా నమోదైన మరణాల సంఖ్య పెంచింది. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా మరణాల సంఖ్య ఎలా పెరిగిందని అడిగిన ప్రశ్నకు చైనా నుంచి సరైన సమాధానం రాలేదు. చైనా గ్యాంబ్లింగ్ లెక్కలను ప్రపంచానికి చూపెడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు ట్రంప్ కానీ ప్రపంచ దేశాలు కానీ ఇదే విషయం గురించి చైనాను ప్రశ్నిస్తున్నాయి. 
 
చైనా ప్రభుత్వం లెక్కల్లో పొరపాటు జరిగిందని అందుకే కొత్త లెక్కలు చెప్పామని చెబుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ఇప్పటికైనా అసలు నిజాలు చెప్పిందా...? అనే ప్రశ్నకు లేదనే సమాధానమే వినిపిస్తోంది. మరోవైపు చైనాలో కరోనా వైరస్ కట్టడి కావడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.       

మరింత సమాచారం తెలుసుకోండి: