ప్రస్తుతం దేశంలో ఇప్పుడు కరోన కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దేశంలో మద్యానికి చాల డిమాండ్ ఉంది. మద్యం కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే దాని సైబర్ నేరస్తులు ఆసరాగా చేసుకొని చాల మంది సొమ్మును కాజేస్తున్నారు. మద్యం అంటే చాలు వెనక ముందు చూడకుండా ఆన్ లైన్ లో మద్యంపై ఆసక్తి చూపించారు కొందరు హైదరాబాదీలు!  ఇక ఏమాత్రం వెనక్కి చూడకుండా ఆర్డర్ చేసేశారు… అనంతరం తాగకుండానే హ్యాంగోవర్ కి బలైపోతున్నారు.


గత నెల 22 నుంచి రూ.17,500 కోట్లకు పైగా ఆదాయం రాష్ట్రాలు కోల్పోయినట్టు చెబుతున్నారు. “లాక్‌డౌన్”‌ ఉన్నా లిక్కర్‌ విక్రయాలకు పలు రాష్ట్రాల ప్రయత్నాలు చేయగా అలాంటివి అనుమతించబోమని తేల్చిచెప్పింది  కేంద్రం. అయితే ఇప్పుడు మన దేశం కాదు కానీ దుబాయ్ ప్రభుత్వం మ‌ద్యం డోర్ డెలివ‌రీకి అనుమ‌తి ఇచ్చింది. 

 

దుబాయ్ లో మ‌ద్యం అమ్మకాలు చేప‌ట్టే రెండు ప్రధాన కంపెనీలు డోర్ డెలివ‌రీని చేప‌డుతున్నాయి. బీర్లు, స్పిరిట్‌, వైన్ ను రెండు కంపెనీలు ఇంటివ‌ద్దకే చేరుస్తున్నాయి. మన దేశంలో కూడా బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాలు ఇప్పటికే మద్యం అమ్మకాలు చేపట్టాయి. దీంతో తమ తమ రాష్ట్రాల్లో కూడా ఈ మద్యం అమ్ముకునేలా అనుమతులు ఇవ్వాలని మందు బాబులు కోరుతున్నారు.  

 

యాకుత్ పురాకు చెందిన ఓ వ్యక్తి రూ.3.27 లక్షలు, మెహిదీపట్నంకు చెందిన మరో వ్యక్తి రూ.48 వేలు ఈ “ఇంటివద్దకే మద్యం” బ్యాచ్ కి చెల్లించారు. పార్టీలకో, వ్యాపారానికో ప్లాన్స్ చేసేసుకుని అంతా రెడీ అయిపోయి ఎంతకాలం అవుతున్నా మద్యం మాత్రం ఇంటికి రావడం లేదు.

 

దీంతో అప్పటికి కాస్త జ్ఞానోదయం అయ్యిందో ఏమో కానీ… తాము నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు గుర్తించి సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ నేపధ్యంలో మద్యం దొరక్క మందుబాబులు ఓవైపు వెర్రెక్కిపోతుంటే.. వీరి బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు తెలివిగా బుట్టలో వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: