వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుని, అతని కుమారుడు నారా లోకేష్ ని తీవ్రంగా విమర్శిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయిరెడ్డి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడని... తానే ముఖ్యమంత్రి అనుకొని వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోల్పోయి ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబు నోటికొచ్చినట్టు ఏవేవో మాట్లాడుతున్నాడు అని విజయ సాయి రెడ్డి మండిపడ్డారు.


విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ... "విపత్కర సమయాలలో రాజకీయ నేతలంతా కలిసి పోరాడతారు. అప్పట్లో పాకిస్తాన్ చైనాతో యుద్ధం చేసినప్పుడు నెహ్రూ గారి కి ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా మద్దతు తెలిపిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేస్తున్నారు. కానీ ఈరోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా చలామణి అవుతున్న చంద్రబాబు తనకు ఇవేమీ వర్తించనట్టు ప్రవర్తిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ తో మాట్లాడి కరోనా పై చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలిపారు. ఇలాంటి వాతావరణంలో కూడా నాకు ఇవేమీ వర్తించవు. నేను వీటన్నిటికీ అతీతుడిని. నాకు రాజకీయాలే ముఖ్యమని రాజకీయ విలువలు లేనటువంటి, మానవతా విలువలు లేనటువంటి కుటుంబ విలువలు లేనటువంటి ఒకే ఒక వ్యక్తి ఈరోజు రాజకీయ విమర్శలు చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషిస్తూ సమస్త మానవ జాతికే కీడు చేస్తున్నాడు. రాక్షస ప్రవర్తన కలిగిన చంద్రబాబు అధికారం పోయినప్పటికీ కూడా తానే ముఖ్యమంత్రిగా భ్రమ పడుతుంటాడు. వీడియో కాన్ఫరెన్స్ పెడతాడు. ఎవరో ఒక నలుగురిని పిలిచి జూమ్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఆ కాన్ఫరెన్స్ లో తాను నాలుగు సలహాలు ఇవ్వడం వలనే కేంద్ర ప్రభుత్వం ముందుకు నడుస్తోందని అనుకుంటాడు"


"హైదరాబాద్ లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేస్తున్నానని తెలియక ఓ నలుగురుని పిలిచే ఏవో సూచనలు ఇస్తుంటాడు. చంద్రబాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనే? ఒక అనుమానం నాకు వచ్చింది. చంద్రబాబు అనే ఒక వ్యక్తి ఎందుకు చంద్రముఖిలా మారిపోయాడు? అనే అనుమానం వచ్చిన నేను చాలామంది సైకియాట్రిస్టులను, న్యూరాలజిస్టులను, డాక్టర్లను, మేధావులను కలిసి అడగడం జరిగింది. ఎందుకు ఇతను అబద్ధం చెప్తున్నాడు? ఎందుకు ఇతను ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోస్తున్నాడు? అనే అంశంపై చర్చించడం జరిగింది. కానీ నాకు మాత్రం సమాధానం ఇప్పటివరకు దొరకలేదు. నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. అదేంటంటే చంద్రబాబు లాక్ డౌన్ లో ఉన్నారా? లాకప్ లో ఉన్నారా అనే అనుమానం వచ్చింది. ముత్యాలముగ్గు సినిమాలో లాగా తనకు కూడా ఒక డప్పు కొట్టే బృందం ఉంది. వాళ్లు ఎప్పుడూ చంద్రబాబు ముందు.. ' మీలాంటి సీఎం ఎక్కడా ఉండరు సార్, మీరు సూపర్ సార్!! మీరు తోపు సార్' అంటూ డప్పు కొడుతుంటే ఆయన సంతోష పడుతూ ఉంటాడు. ఈ విషయాలన్నీ పక్కనపెడితే నాకు నారా లోకేష్ ఒక నిక్కరు వేసుకొని సైకిల్ తొక్కుతున్న ఓ అపురూపమైన చిత్రం కనిపించింది", అని ఆయన అన్నారు.


వాస్తవానికి మొన్నీమధ్య నారా లోకేష్ తన విలాసవంతమైన చంద్ర భవనం నుండి బయటకు వచ్చి టీడీపీ పార్టీ గుర్తు అయిన సైకిల్ పై చక్కర్లు కొట్టాడు. తన కొడుకు దేవాంశ్ కూడా నాన్న నాన్న నన్ను కూడా సైకిల్ పై ఎక్కించుకో అంటూ సైకిల్ వెనుక ఉరుకులు పరుగులు తీశాడు. అయితే ఈ ఫోటో సోషల్ మీడియా తెరపైకి రాగా... చాలామంది అతడిని తిట్టిపోశారు. ఏమయ్యా నారా లోకేష్ బాధ్యత గల నేతవై ఉండి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతావా? అంటూ కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి.


అయితే ఈ ఫోటోనే ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డి చాలా విమర్శలు చేశారు. చిన్న బాబుకు సైకిల్ తొక్కాలి అనే ఆశ ఉంది కానీ( పార్టీపై పెత్తనం చెలాయించాలని) చంద్రబాబు ఆ సైకిల్ ఎక్కనివ్వడు. పెదబాబు సైకిల్ పై నుండి అస్సలు దిగడు. పెద్ద బాబు సైకిల్ పై ఉంటే సైకిల్ ముందుకు కదలదు. ఒకవేళ పెద్ద బాబు సైకిల్ దిగినా చిన్న బాబు ఆ సైకిల్ ఎక్కితే అది బతకదు' అంటూ విజయసాయిరెడ్డి నారా లోకేష్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: