ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ ను వెనక్కి  తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ - కామర్స్ సమస్యలకు అత్యవసరం కానీ సర్వీసులను అందించేందుకు ఇచ్చిన అనుమతి వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర హోం కార్యదర్శి నేడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తాజాగా 14న లాక్ డౌన్ విధానాన్ని పొడిగించిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. ఇందులోని భాగంగానే అవసరం కానీ సర్వీసులను ఈ కామర్స్ సంస్థలు ఈ  అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ విషయం పై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం జరిగింది. 

 


ఇక ఈ నిబంధన ప్రకటన వచ్చిన తరువాత కొన్ని ఈ కామర్స్ దిగ్గజాలు వినియోగదారుల నుంచి ఆర్డర్లను తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ ఆర్డర్ లో అన్నిటిని కూడా 20 తర్వాత డోర్ డెలివరీ చేయాలని ఈ కామర్స్ సంస్థలు సిద్ధమయ్యాయి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ గైడ్ లైన్స్ ని వెనక్కి తీసుకోవడంతో ఈ కామర్స్ సంస్థలు ఆర్డర్స్ క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు వారు పే చేసిన డబ్బులను మీకు రిఫండ్ చేయనున్నారు.

 


ఈ నిర్ణయంతో దేశీయ వర్తకులు ఈ కామర్స్ సైట్లు మధ్య విభేదాలు విమర్శలు ఏర్పడ్డాయని సమాచారం. నిజానికి ఇటీవల ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్ కి పాజిటివ్ రావడంతో ఈ నిబంధనని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు హైదరాబాదులో ఒక డెలివరీ బాయ్ కి కూడా పాజిటివ్ కూడా రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ నిర్ణయాన్ని వెన్నక్కి తీసుకోవడం ఒకింత మనకోసమే అనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: