మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ప్రముఖులు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా బాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇకపోతే చంద్రబాబు మనవడు దేవాన్ష్ బ్రాహ్మణి ట్విట్టర్ ఖాతా ద్వారా తాతకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
దేవాన్ష్ తాతకు శుభాకాంక్షలు తెలిపిన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దేవాన్ష్ ప్రపంచంలోనే ప్రియమైన తాతయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు. "తాతా... మీ ప్రేమను పొందడం చాలా గొప్ప  విషయం... మీరే నాకు ఓ స్పూర్తి, ఐకాన్. అన్నిటికీ మించి మీరు నా బెస్ట్ ఫ్రెండ్ " అని ట్వీట్ చేశారు. దేవాన్ష్ చేసిన ఈ ట్వీట్ పలువురిని విపరీతంగా ఆకర్షిస్తోంది. 
 
దేవాన్ష్ కు తాతతో చాలా అనుబంధం ఉంది. చంద్రబాబుకు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా మనవడితో ఆడుకుంటారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నేతగా, దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, నవ్యాంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు. 

 

విభజన అనంతరం నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. నారా దేవాన్ష్ చేసిన ట్వీట్ పై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాత పట్ల దేవాన్ష్ చూపుతున్న ప్రేమకు నెటిజన్లు, చంద్రబాబు అభిమానులు ఫిదా అవుతున్నారు. టీడీపీ నాయకులు సైతం చంద్రబాబును ఐకాన్ గా భావిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: