2014 ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్ధతిచ్చిన పవన్ 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో ఏపీలో జనసేన పొటీ చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 
 
2019 ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపలేకపోయినా దాదాపు 7 శాతం ఓటింగ్ తెచ్చుకుంది. ఏపీలో జనసేన గెలుపు కోసం జనసైనికులు ఎంతో కష్టపడ్డారు. పార్టీ నుండి ఆర్థికంగా ఎటువంటి ప్రయోజానం చేకూరకపోయినా స్వచ్చందంగా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. జనసేన పార్టీ స్థాపించిన రోజు నుంచి జనసైనికులు పేదవారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. 
 
పలు ప్రాంతాలలో జనసైనికులు అన్నదాన కార్యక్రమాలు చేపడుతుండగా కొందరు ధనసహాయం చేస్తూ ఇతరత్రా సహాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ జనసైనికులకు కొన్ని సూచనలు చేస్తోంది. ఇతరులకు సహాయం చేయడం అభినందించదగిన విషయమే కానీ తాహతకు మించి ఖర్చు చేయవద్దని బీజేపీ నేతలు జనసైనికులకు సూచిస్తున్నారు. 
 
అప్పులు చేసి సేవలు చేయవద్దని... ఆ సేవలు స్థోమతను మించి వద్దని చెబుతున్నారు. స్థోమతకు మించి సహాయం చేస్తే భవిష్యత్తుల్లో ఇబ్బందులు వస్తాయని.... అందువల్ల అవసరమైతే కొంతమందితో కలిసి సహాయం చేయాలని చెబుతున్నారు. బీజేపీ జనసైనికులకు మంచి సూచనే ఇచ్చిందని చెప్పవచ్చు. మరి ఈ సూచనపై జనసైనికులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అభిమానం మంచిదే కానీ ఆ అభిమానం హద్దులు దాటితే మంచిది కాదని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: