ఊహించని రీతిలో ప్రపంచం మొత్తాన్ని కమ్మేసిన కరోనా వైరస్, మనదేశంలో కూడా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే కరోనాని త్వరగా గుర్తించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్యని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కరోజులో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ముందు వరుసలో నిలిచింది.

 

ప్రతి 10 లక్షల జనాభాకు 830 మందికి కరోనా పరీక్షలు చేసి.. దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక రోజూ 5 వేల టెస్టులపైనే చేస్తున్నారు. ప్రస్తుతానికి 41,512 మందికి టెస్టులు చేశారు. అయితే మొన్నటివరకు రోజు అత్యధిక టెస్టులు చేసే రాష్ట్రంగా రాజస్థాన్ ఉండేది. ఇక ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని పక్కకునెట్టేసి, ఏపీ ముందుకు వచ్చింది. ఇక కరోనా వ్యాప్తి కట్టడి జగన్ ఎంత కృషి చేస్తున్నారో దీని బట్టి అర్థమైపోతుంది. కానీ టీడీపీ నేతలు అవేమి పట్టించుకోకుండా, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

 

ప్రతిదానిలోనూ బాబు బ్యాచ్ కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. అసలు కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, కరోనా కేసులు దాచిపెడుతున్నారని, కరోనా పెరగడానికి వైసీపీ నేతలే కారణమంటూ మాట్లాడుతున్నారు. అయితే జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడికి ఎంత కృషి చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ నిత్యం సమీక్ష సమావేశాలు పెడుతూ, ఓ వైపు కరోనాని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూనే, మరోవైపు లాక్ డౌన్ వల్ల రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.

 

అలాగే మొన్నటివరకు కరోనా టెస్టులని తక్కువ చేస్తున్నారని చంద్రబాబు విమర్సలు చేశారు. ఇక ఇప్పుడు టెస్టుల సంఖ్యని పెంచి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కాబట్టి ఇక నుంచైనా బాబు బ్యాచ్ అర్థంపర్ధం లేని విమర్సలు చేయకుండా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఇంకా అదే పనిలో ఉంటే, జనమే టీడీపీ పని పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: