దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనాపై రాజకీయం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రతిపక్షాలు, విమర్సలు, ఆరోపణలు చేయడంలో బిజీగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ పార్టీలు పనిచేస్తున్నాయి.

 

అయితే అంతా జగన్ పై విమర్సలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు డైరక్షన్ లొనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. బాబు ఏవైతే విమర్సలు చేస్తారో, అవే విమర్సలు మిగతా పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాబు డైరక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కూడా విమర్సలు చేయడం మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కనుమరుగైపోయిన విషయం తెలిసిందే.

 

కానీ అందులో మిగిలి ఉన్న కొందరు నేతలు ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ కి మాజీ మంత్రి శైలజ నాథ్  కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాక, పెద్దగా కనిపించని శైలజ నాథ్ కరోనా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. సేమ్ టీడీపీ లాగానే జగన్ ప్రభుత్వంపై విమర్సలు చేశారు.

 

ఈ సమయంలో కాంట్రాక్టర్లకు డబ్బులివ్వడం, ఎన్నికల కమిషనర్‌ను మార్చడం తప్ప జగన్ కరోనాపై చర్యలు తీసుకున్నది శూన్యమన్నారు. ఇక పరీక్షలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పడం కాదని, అందరినీ పరీక్షించాలని, ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతీ రూపాయి ప్రజలదే అంటూ నాలుగు పెద్ద డైలాగులు వేశారు.

 

ఇక ఈయన విమర్సలు చూస్తే, బాబు లైన్ లొనే ఉన్నాయని అర్థమైపోతుంది. అసలు కాంగ్రెస్ నేతలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, బాబు డైరక్షన్ లోనే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తులసిరెడ్డి లాంటి వారైతే, జగన్ పై విమర్సలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. మొత్తానికైతే జగన్ పై విమర్సలు చేస్తే కాంగ్రెస్ నేతలు ఇమేజ్ పెరుగుతుందని అనుకుంటున్నట్లున్నారు. ఇలా చేయడం వల్ల కాస్తోకూస్తో ఉన్న ఇమేజ్ కూడా పోతుందని అర్ధం కావడం లేదు అనుకుంటా.

మరింత సమాచారం తెలుసుకోండి: