కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఏనోట విన్నా ఇదే మాట. ఇప్పటికి నెల రోజులుగా ఇండియా అంతా పూర్తిగా ఇంట్లో బందీ అయ్యింది. మరో వారం పది రోజుల్లో లాక్ డౌన్ ఎత్తేయబోతున్నారు. ఆ రోజు కోసం దేశంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే అసలు ఈ కరోనా ఎప్పుడు దేశాన్ని వదిలి పోతుంది. కరోనాకు ముందు ఉన్న సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయి.?

 

 

ఈ లాక్‌ డౌన్లు, ఆంక్షలు ఎప్పుడు పూర్తిగా తొలగిపోతాయి. మళ్లీ కరోనా భయం లేకుండా జనం సాధారణస్థితికి ఎప్పుడు వస్తారు.. ఇలాంటి ప్రశ్నలకు ఎవరకూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే.. కరోనా గురించి తాజాగా ఓ భయంకరమైన వాస‌్తవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా వైరస్ ప్రభావం చాలా కాలం ఉంటుందని ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

 

 

ప్రస్తుతం కొన్ని దేశాలలో అదుపులోకి వచ్చిందని భావిస్తున్నా, కొన్ని చోట్ల అది మళ్లీ వెలుగు చూస్తోందని డబ్ల్యు.హెచ్.డైరెక్టర్ ట్రడోస్ పేర్కొన్నారు. కోవిడ్ 19 ని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న కాలంలో ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన అంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఐరోపా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు ఐరోపా దేశాల్లో ఇది తీవ్రంగా ఉందని గుర్తు చేస్తున్నారు.

 

 

ఆయన చెబుతున్న మాటలు వింటుంటే.. ప్రపంచానికి కరోనా భయం ఇప్పట్లో తొలిగే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఈ కరోనా రాక్షసి నుంచి ఇండియా ఎలా గట్టెక్కుతుంది.. ఎన్నాళ్లు లాక్ డౌన్లు అమలు చేస్తారు.. ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక పరిస్థతి ఏంటి.. ఇలాంటి వన్నీ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగులుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: