ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..ఇకపోతే కరోనా నుంచి ఎలా బయట పడాలని ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు కరొనను పూర్తిగా నాశనం చేయొచ్చునని నిపుణులు అంటున్నారు. 

 

 

 

లాక్ డౌన్ పతిష్టాంగా కొనసాగుతున్న కూడా కరోనా ఉగ్ర రూపం దాల్చుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా ప్రభావం మరింత పెరుగుతూ వస్తుంది. కరొనను ఎక్కడిక్కడి కట్టడి చేసేందులు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన కూడా కరోనా ప్రభావం మాత్రం అంతకు రెట్టింపు అవుతూ వస్తుంది. అసలు విషయానికొస్తే కరోనా కారణంగా ముస్లింలు జరుపుకుంటున్న ఒకే ఒక పండుగ కూడా రంజాన్ కూడా గండి పడింది. 

 

 

 

ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలకు వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరే ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఈ మెనూ అమల్లోకి రానుంది.క్వారంటైన్లలో ఉండే ముస్లింలు తెల్లవారుజామున ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. ఈ సమయంలో షెహరిగా రొట్టెలు, దాల్, వెజ్ కర్రీ అందించనున్నారు. 

 

 

 


ఇకపోతే  సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కిచిడీ, బగారా రైస్, దాల్చా అందిస్తారు. అల్పాహారంగా ఖర్జూరం పండ్లు, అరటి పండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. రోజు విడిచి రోజు చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ అందిస్తారు. ముస్లింల బాధలను కొంతవరకైనా తీర్చి దేవుడిని పవిత్రంగా పూజించడానికి తెలంగాణ సర్కారు చేసిన పనికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: