కొంతమంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు వారి కూడా నిజంగా తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. నిజానికి కొంతమంది మానసిక స్థితి లేదా ఏదైనా ఆరోగ్య పరిస్థితులు బాగా లేకో లేదా ఏదైనా ఆర్థిక పరిస్థితుల వలనో ఆత్మహత్యలు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే...

IHG


తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి నల్గొండ లోని శివరాం నగర్ కాలనీకి చెందిన పొట్టబత్తిని (35 ) గా గుర్తించారు. ఈయన పానగల్ చెరువు ప్రాంతంలోని SLBC కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోగా శనివారం నాడు చెరువులో మృతదేహం చేరడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం బయటికి వచ్చింది. దీంతో పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కొరకు ఆసుపత్రికి తరలించారు.

IHG


అయితే నల్గొండ పట్టణ 2 టౌన్ ఎస్సై నర్సింహులు చెప్పిన విషయం ప్రకారం... రాజశేఖర్ కు ఆరు నెలల ముందు ఆయన మూడో వివాహం చేసుకున్నాడు. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న అతను వారితో మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయితే ఆయన తిరిగి మరల ఆరు నెలల క్రితం మూడో పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే అతడి జీవితంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకోవడంతో, మూడో భార్యతో గొడవలు జరుగుతుండడంతో అతను తీవ్ర మనస్తాపానికి లోనై " నేను చనిపోతున్నాను నువ్వైనా సుఖంగా ఉండు " అంటూ శుక్రవారం నాడు తన భార్య మెసేజ్ పెట్టి రాజశేఖర్ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో నల్గొండ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: