ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 81 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.  ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో, ముందు జాగ్రత్త చర్యగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా వైరస్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.  విజయవాడలోని గవర్నర్ అధికారిక నివాసంలో ఉన్న వైద్య బృందంలో ఈ స్టాఫ్ నర్సు సేవలు అందిస్తున్నారు. ఇక ఆమెకు కరోనా అని తేలడంతో చికిత్స కోసం విజయవాడలో నియమించబడిన కోవిడ్ -19 ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటికే కొంతమంది పోలీసులు కూడా ఈ వైరస్ బారిన పడటంతో విజయవాడ నగరం టెన్షన్ లో మునిగి ఉంది. 

 

ఈరోజు అక్కడ కొత్తగా 52 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 150ను క్రాస్ చేసింది. ఇవన్నీ నగరానికి చెందినవేకావటంతో బెజవాడవాసులు ఆందోళన చెందుతున్నారు.  కాగా, రాజ్ భవన్ లో కరోనా సోకిన వారిలో ఎవరికీ ట్రావెల్ హిస్టరీ లేదని, వైరస్ సోకిన వారితో కలిసిన సందర్భాలూ లేకపోవడంతో ఉన్నతాధికారులు అవాక్కయయారు. రాజ్ భవన్ లో 12 మంది మెడికల్ టీమ్ పనిచేస్తున్నామని, లాక్ డౌన్ మొదలైన తర్వాత తమని ఎవర్నీ బయటకు వెళ్లడానికి అనుమతించలేదని పేర్కొన్నారు. కాగా, వ్యాధి బారిన పడిన వారిలో ముగ్గురిని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  

 

తనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, తాము రాజ్ భవన్ నుంచి కాలు బయటకు పెట్టలేదని కరోనా సోకిన నర్స్ స్పష్టం చేశారు. కృష్ణలంకలో ఒక్క లారీ డ్రైవర్ వల్లే 18 కేసులు నమోదయ్యాయి. దీంతో అతడితో కాంటాక్ట్ ఉన్నవారిని ట్రేస్‌ చేసే పనిలోపడ్డారు అధికారులు. ఇప్పటికే అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఇప్పటికే కృష్ణలంకను మొత్తం క్లోజ్ చేశారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: