కరోనాని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విమర్సలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలు గ్యాప్ లేకుండా టీడీపీ వాళ్ళు, జగన్ పై విరుచుకుపడుతున్నారు. పైగా  కరోనా కేసులు పెరుగుతుండటంతో టీడీపీకి రాజకీయంగా కలిసొచ్చింది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి, కరోనాని అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతున్నారు.

 

ప్రతిరోజూ చంద్రబాబు నుంచి చోటా నేత వరకు జగన్ ప్రభుత్వాన్ని తిట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వం కరోనాని కట్టడి చేసేందుకు కృషి చేస్తుండటం వల్ల, టీడీపీ నేతలు చేసే ఆరోపణలకు పెద్దగా చెక్ పెట్టలేకపోతున్నారు. ఫలితంగా టీడీపీ చేసిన ఆరోపణలు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వంపై నెగిటివ్ పెరిగే పరిస్థితి వచ్చింది.

 

ఈ క్రమంలోనే విషయాన్ని అర్ధం చేసుకున్న మంత్రి మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నేతలు విమర్సలు చేయకుండా సాయం చేయాలని కోరారు. ఒకానొక దశలో టీడీపీనే కరోనా వ్యాప్తి చేస్తుందని చెప్పినా, తర్వాత మాత్రం ప్రతిపక్షం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయాలే తప్ప.. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.  అలాగే చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారని.. ఏపీకి వచ్చి భయంతో ఉన్న ప్రజలను ఓదార్చడానికి తన వంతు సహకారాన్ని అందించాలేతప్ప.. రాజకీయ విమర్శలు చేయవద్దని మంత్రి ఓ మంచి సూచన చేశారు.

 

అయితే మంత్రి మంచిగానే చెప్పారు. ఇలాంటి టైంలో ప్రతిపక్షం సాయం కూడా ఎంతైనా అవసరం ఉంది. వారు అర్థంపర్ధం లేని విమర్సలు చేయకుండా విలువైన సలహాలు ఇస్తే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. కానీ చంద్రబాబు అండ్ బ్యాచ్ మాత్రం అలా చేయడం లేదు. కేవలం కరోనాని రాజకీయంగా వాడేసుకుంటున్నారు. అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి అని అర్ధం చేసుకోకుండా రోజూ విమర్సలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఇక ఇప్పటికైనా మారి కొంచెం ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: