వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీతో సహా మిగిలిన ప్రతిపక్షాలు సీఎం జగన్ మీద గ్యాప్ లేకుండా విమర్సలు చేస్తూనే వస్తున్నాయి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్న దానిపై రాజకీయం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా టీడీపీ,జనసేన ఒకే లైన్ లో నడుస్తూ, జగన్ ని టార్గెట్ చేస్తూ వచ్చాయి. చంద్రబాబు ఏవైతే విమర్శల చేస్తారో, అవే విమర్సలు పవన్, జగన్ మీద చేసేవారు.

 

అయితే ప్రస్తుతం కరోనాని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సహకరించకుండా విమర్సలు చేస్తున్నారు. అసలు కరోనా అరికట్టడంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా కూడా కరోనాపై జగన్ చేసిన వ్యాఖ్యలపై బాబు ఫైర్ అయిపోతున్నారు. విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయటపడుతుందని.. కానీ ఏపీలో పరిస్థితిని నియంత్రించలేక చేతులెత్తేసిన పరిస్థితి కనబడుతోందని జగన్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

కాకపోతే ఎప్పుడు బాబు రూట్ లో ఉంటూ, జగన్ పై ఫైర్ అయ్యే పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త మెతక వైఖరి అవలంభిస్తున్నారు. కరోనా వచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు జోలికి పోను అంటూ చెబుతున్న పవన్, పెద్దగా జగన్ ప్రభుత్వంపై విమర్సలు చేయడం లేదు. కానీ పరోక్షంగా ప్రభుత్వానికి చురకలు అంటిస్తున్నారు. తాజాగా కరోనాతో కలిసి  జీవించాలన్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...కరోనా మాముల జ్వరం కాదు.. భయంకరమైన అంటూ..కరోనా వచ్చిన వారిలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు చెప్పారు. అంటే జగన్ కరోనాని లైట్ తీసుకుంటున్నారని పరోక్షంగా చెప్పారు.

 

అయితే పవన్ జగన్ ప్రభుత్వాన్ని పెద్దగా టార్గెట్ చేయకపోయిన, వారి మిత్రపక్షం బీజేపీ మాత్రం ఓ రేంజ్ లో జగన్ ని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. టీడీపీతో పోటీ మరీ బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్సలు గుప్పిస్తున్నారు. అంటే జగన్ ప్రభుత్వాన్ని బాబు తర్వాత బాగా టార్గెట్ చేసింది బీజేపీనే. మొత్తానికైతే పవన్ కాస్త తగ్గిన బాబు-బీజేపీలు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: