ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సంచలనం సృష్టిస్తూ ఉంటే... మరోవైపు దుర్మార్గులు హత్యలు చేయడానికి ఒడిగడుతున్నారు. గంజాయి మత్తులో ఆరుగురు యువకులు గొడవపడి స్నేహితుడుని చంపిన ఘటన తమిళనాడులోని చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ముఖ్య నిందితులు అయిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నైలోని తిరువయ్యూరు రాజాకడై రామానుజన్ వీధికి చెందిన ఒక యువకుడు రవి ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. రవి కొడుకు జయరాం ఈనెల 25వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా దొరకలేదు. 

 

 

ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెళ్లివాయల్‌ చావడి కు చెందిన జయరాజ్ అనే యువకుడికి జయరామన్ ఫోను 25వ తారీకు ఫోన్ చేసినట్లు సమాచారం. ఆ సమయంలో బైక్ నడుపు ఉండడంతో జయరాజు ఫోన్ మాట్లాడలేదు.. కానీ జోబులో పెట్టే సమయంలో ఫోన్ కాల్ లిఫ్ట్ అయ్యి కాల్ రికార్డర్ నిమిషాల పాటు అయింది. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న జయరాజ్ రికార్డ్ ఆయన మాటలు విని చాలా ఇబ్బందికి గురి అవ్వడం జరిగింది.. ఆ తర్వాత మరుసటి రోజు జయరామన్ కుటుంబ సభ్యులకు పోలీసులకు ఆ రికార్డును అప్పగించాడు. దీనితో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అధికారులు.

 


ఇక అసలు ఆ రాత్రి ఏమి జరిగింది అన్న విషయానికి వస్తే ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి బలవంతంగా తీసుకెళ్లి గంజాయి తాగడంలో ఎవరు గొప్ప అన్న విషయంపై ఫ్రెండ్స్ అందరూ కూడా గొడవ పడడం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న స్నేహితులు అందరూ గొడవ పెరగడంతో రాయి పెంకులు సీసాలతో కొట్టి అక్కడికక్కడే చంపేశాడు. అంతేకాకుండా జయరామన్ మృతదేహాన్ని ఎవరు గుర్తు పట్టలేకుండా ఉండేందుకు సముద్ర తీరంలో పూడ్చి పెట్టడం జరిగింది. ఇక ఇటీవల చాకలిపేట డిప్యూటీ కమిషనర్ సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయడం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: