భారత దేశంలో రోజురోజుకీ కరోనా పరిస్థితి ఎలా ఎక్కువ అవుతుందో చూస్తూనే ఉన్నాము. దీనికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నిస్తున్న ప్రజల నుంచి కాస్త ఎదురీత జరుగుతుందని చెప్పవచ్చు. దీనికి కారణం ప్రభుత్వం ప్రజల కోసమని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి లాక్ డౌన్ వ్యవస్థని ఏర్పాటు చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండమని తెలిపింది.

IHG

ఇకపోతే కొందరు ఈ విధానాన్ని పాటించకుండా వారి ఇష్టారాజ్యం వచ్చినట్లు బయట తిరుగుతున్నారు. పోలీసులు వారి శక్తికి మించి ప్రయత్నిస్తున్నప్పటికీ కొందరు మాత్రం ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారు. అంతేకాకుండా డాక్టర్లు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే... గత వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తుంది అని చెప్పుకోవచ్చు.

 


ఇక అసలు విషయం ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయం తెలియజేశారు. ఈ ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాశారు.

IHG

 

కరోనా వ్యాప్తి చెందుతున్న ఇలాంటి సమయాల్లో వేలిముద్రలను వేయాలి అనడం సరైన నిర్ణయం కాదని తెలిపాడు. దీని వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని కోసం వెంటనే వేలి ముద్ర విధానం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వానికి కన్నా లక్ష్మీనారాయణ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: