1886 లో కార్మీకులకు 8 గంటల పని విధానం కావాలి అంటూ షికాగో లో శ్రామికులు చేసిన నిరశన ప్రదర్శన ఆతరువాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితం చేసిన శ్రామికుల హక్కుల పోరాటానికి నాంది పలికింది. ప్రపంచ వ్యాప్తంగా అప్పటి నుంచి జరుగుతున్న శ్రామికుల పోరాటం లక్ష్యాలు మారుతున్నా ఇప్పటికీ ప్రపంచంలో ముఖ్యంగా భారత దేశంలో తినడానికి తిండి లేక సంపాదన లేక అమెరికా నుండి అమ్రాబాద్ వరకు ఎన్ని సంవత్సరాలు మారినా ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల మంది ప్రజలు తినడానికి సరైన తిండిలేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు అన్నది వాస్తవం.

 

అంతర్జాతీయ కార్మిక సంస్థలు ఎన్ని ఉద్యమాలు చేసినా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కార్మీకుల దుస్థితి ఆవేదనకు గురి చేస్తోంది. ప్రతి సంవత్సరం వచ్చే మేడే కి మనదేశంలో ఈరోజు వచ్చిన మేడే కి చాల తేడా ఉంది. దాదాపు 20 కోట్ల మంది వలస కార్మీకులు కరోనా సమస్యతో రోడ్డెక్కి ఆకలితో బాధ పడుతున్నా చేతిలో డబ్బు లేకపోయినా ఎదోవిధంగా తమ సొంత ఊరికి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ మండుతున్న ఎండను లెక్క చేయకుండా రోడ్డు పై తమ పిల్లలను నెత్తిన పెట్టుకుని గమ్యం తెలియని ప్రయాణం చేస్తున్న వలస కార్మీకులను చూస్తే మనసున్న ఏ మనిషి అయినా కరిగిపోతాడు. 

 

ప్రస్తుతానికి వివిధ రాష్ట్రాలలో చిక్కుకుని దిక్కు తోచక ఆకలి తో పోరాటం చేస్తున్న వలస కార్మికులను తమ ఊళ్ళకు వెళ్ళి పోవడానికి ప్రభుత్వాలు అంగీకరించినా ఇన్ని కోట్లమందిని ఎలాంటి సమస్యలు లేకుండా వారివారి స్వస్థలాలకు ఎలా చేర్చాలి అన్న విషయం పై అయోమయం నెలకొని ఉంది. తాత్కాలికంగా వీరందరి కోసం రైళ్ళు నడపాలి అని ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నా ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ సరిహద్దులను మూసివేయడంతో చాల రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక రైళ్ళు తమ రాష్ట్రాల మీదుగా వెళ్ళడానికి అంగీకరిస్తాయా అన్న సందేహాలు వస్తున్నాయి.

 

దీనికితోడు ఈ ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు ఆ వలస కార్మీకులు కాని లేదంటే వలస కార్మీకులకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు కాని పెట్టుకోవాలి అని షరతులు ఉంటాయి అన్న వార్తలు వస్తున్న పరిస్థితులలో వలస కార్మీకులకు సొంత ఊరుకు వెళ్ళే దారి ఏది అంటూ సందేహాలు పెరుగుతున్నాయి. దేశంలో మరికొంత కాలం లాక్ డౌన్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్న నేపధ్యంలో ఇలా లాక్ డౌన్ నెలలు తరబడి కొనసాగితే దేశంలో పేద ప్రజలు కరోనా వల్ల కంటే ఆకలి సమస్యలతో ఎక్కువగా చనిపోయే ఆస్కారం ఉంది అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈరోజు మేడే ని గుర్తు చేస్తూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న వలస కార్మికుల కవాత్తుల మధ్య నడిరోడ్డు మీదే నేడు మేడే జరుగుతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: