ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా పేరు వింటే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. ఆదాయం తగ్గుతుండడంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వాలు సైతం విఫలమవుతున్నాయి. అయితే తాజాగా మలేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
మే 4వ తేదీ నుంచి మలేషియాలో పరిశ్రమలు తెరచుకోనున్నాయి. వ్యాపార, వాణిజ్య సేవలు ప్రారంభం కానున్నాయి. జనం గుంపులుగుంపులుగా గుమికూడే ప్రదేశాలు మినహా మిగతా అన్ని కార్యకలాపాలకు  ప్రభుత్వం అనుమతిచ్చింది. కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గడం సాధ్యం కాదని భావించి మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 4వ తేదీ నుంచి కొన్ని నిబంధనలను అమలు చేస్తూ లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు ఇతర దేశాలు మాత్రం కరోనాకు మందు లేకపోవడంతో లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. కరోనా విజృంభణ తగ్గే వరకు, కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్యను తగ్గించటానికి లాక్ డౌన్ పైనే ఆధారపడుతున్నాయి. మలేషియా లాక్ డౌను ను ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయంతో అక్కడి ప్రజలు షాక్ కు గురవుతున్నారు. 
 
లాక్ డౌన్ ను ఎత్తివేస్తే కరోనా భారీన పడే అవకాశం ఉందని, వైరస్ మరింత వేగంగా విజృంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దూర ప్రయాణాలపై కూడా మలేషియా ప్రభుత్వం సిద్ధమవుతోంది. మలేషియా లో లాక్ డౌన్ ను ఎత్తివేసిన అనంతరం కూడా వైరస్ అదుపులో ఉంటే ఇతర దేశాలు కూడా మలేషియాను అనుసరించే అవకాశం ఉంది. మరి లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత మలేషియాలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: